News March 6, 2025

MDK: గెలిచినోళ్ల సంబరాలు.. ఓడినోళ్ల సమాలోచనలు

image

KNR-ADB-NZB-MDK పట్టభద్రుల MLC ఎన్నికల్లో BJP అభ్యర్థి అంజిరెడ్డి 5,106 ఓట్ల మెజార్టీతో గెలవగా ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. 2వ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, 3వ స్థానంలో BSPఅభ్యర్థి ప్రసన్న హరికృష్ణ నిలిచారు. ఎలా ఓడిపోయామని అటు నరేందర్ రెడ్డి, ఇటు హరికృష్ణ శ్రేణులతో సమాలోచనలు చేస్తున్నారు. చెల్లని ఓట్లు 28,686 రాగా తమ ఓటమికి ఇదే ప్రధాన కారణమని ఆ పార్టీల నేతలు అంటున్నారు.

Similar News

News January 12, 2026

నల్గొండ: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం: కలెక్టర్

image

నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. CSతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లోని 162 వార్డులకు సంబంధించి తుది ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తయిందని వెల్లడించారు. ఎన్నికల సిబ్బంది నియామకం, పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ ముగిసిందని, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

News January 12, 2026

NZB: 35 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్

image

నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 35 ఫిర్యాదులను CP సాయి చైతన్య స్వీకరించారు. వాటికి సంబంధించిన పోలీస్ స్టేషన్ల SI, CIలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని కనుక్కుని పరిష్కారానికి సూచనలు చేశారు. కాగా ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నట్టు CP చెప్పారు.

News January 12, 2026

వికారాబాద్: ఎన్నికలకు సిద్ధం కండి: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 12న ఓటర్ లిస్ట్ తుది జాబితా విడుదల చేయడం జరుగుతుందన్నారు. పోలింగ్ కేంద్రాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.