News March 6, 2025

NZB: పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయింది: కవిత

image

కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని BRS ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు బీసీయేతర అభ్యర్థులను బరిలోకి దింపాయని, పార్టీలపరంగా, సిద్ధాంతపరంగా ఓట్లు చీలాయన్నారు. కాబట్టి పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి హరికృష్ణ గెలవలేదని ఆమె అన్నారు. బీసీ రిజర్వేషన్లు ఉంటే ఆ స్థానంలో కచ్చితంగా అన్ని పార్టీలు బీసీకే టికెట్ ఇచ్చేవని వ్యాఖ్యానించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉండాలన్నారు.

Similar News

News March 25, 2026

కృష్ణా: భద్రాచలానికి RTC స్పెషల్ సర్వీసులు

image

శ్రీరామ నవమి సందర్భంగా మచిలీపట్నం, ఉయ్యూరు, అవనిగడ్డ, గుడివాడ, గన్నవరం ఆర్టీసీ డిపోల నుంచి భద్రాచలం వెళ్లేందుకు ఈ నెల 26, 27న ప్రత్యేక RTC బస్సులు నడుపుతున్నట్టు జిల్లా ప్రజా రవాణాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ప్రత్యేక సర్వీసులకు సంబంధించి ఆన్‌లైన్ ద్వారా టికెట్ రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News March 25, 2026

పుట్టపర్తి కలెక్టరేట్‌‌లో డీఐపీసీ సమీక్ష

image

పుట్టపర్తి కలెక్టరేట్‌‌లో కలెక్టర్ శ్యాం ప్రసాద్ అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక అనుమతులు, ప్రోత్సాహక కమిటీ (డీఐపీసీ) సమీక్షా సమావేశం బుధవారం నిర్వహించారు. వివిధ శాఖ ద్వారా పరిశ్రమలకు రావాల్సిన అనుమతులను మంజూరు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గతేడాది విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కుదుర్చుకున్న ఒప్పందాల పురోగతిపై సమీక్షించారు. అవసరమైన భూమిని కేటాయించాలని ఆదేశించారు.

News March 25, 2026

నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

image

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని సార్లపల్లి, కుడిచింతల బైలు గ్రామాల తరలింపు ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం పునరావాస ప్యాకేజీని అందజేసింది. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిర్వాసిత కుటుంబాలకు రూ.15 లక్షల విలువైన చెక్కులతో పాటు భూమి పత్రాలను పంపిణీ చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, అచ్యుతాపురం ఎమ్మెల్యే వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.