News March 6, 2025

MDK: పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయింది: కవిత

image

కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని BRS ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు బీసీయేతర అభ్యర్థులను బరిలోకి దింపాయని, పార్టీలపరంగా, సిద్ధాంతపరంగా ఓట్లు చీలాయన్నారు. కాబట్టి పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి హరికృష్ణ గెలవలేదని ఆమె అన్నారు. బీసీ రిజర్వేషన్లు ఉంటే ఆ స్థానంలో కచ్చితంగా అన్ని పార్టీలు బీసీకే టికెట్ ఇచ్చేవని వ్యాఖ్యానించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉండాలన్నారు.

Similar News

News November 7, 2025

హనుమకొండ: ఐనవోలులో సినిమా షూటింగ్

image

ఐనవోలు మండలం రెడ్డిపాలెం, రాంనగర్, నందనం గ్రామాల్లో శివభ్రమేంద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ సినిమా షూటింగ్ జోరుగా కొనసాగుతోంది. రమేశ్ బాబు దర్శకత్వంలో, సావిత్రమ్మ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మనోజ్ హీరోగా, శృతి, మౌనికలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా రాంనగర్‌లో నటుడు సుమన్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఆయనను చూడటానికి స్థానికులు తరలివచ్చారు.

News November 7, 2025

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

గరివిడి మండలం చిన ఐతంవలస వద్ద శుక్రవారం ఆర్టీసీ బస్సు, స్కూటీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో చీపురుపల్లి మండలం పెరుమాళికి చెందిన కొరగంజి శ్రీలత (48)మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. భర్త సంగం నాయుడుతో కలిసి స్కూటీపై చీపురుపల్లి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది.ఈ దుర్ఘటనలో బస్సు ముందు చక్రం శ్రీలత తలపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా నాయుడు తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డాడు.

News November 7, 2025

వరంగల్ సీపీ కార్యాలయంలో వందేమాతరం గేయాలాపన

image

వందేమాతరం జాతీయ గేయం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అధికారులు సిబ్బంది వందే మాతరం గేయాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు రవి, ప్రభాకర్ రావు, శ్రీనివాస్‌తో పాటు ఏఓ, ఏసీపీలు, ఆర్ఎస్ఐలు, ఇన్‌స్పెక్టర్లు, ఇతర పరిపాలన, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.