News March 6, 2025
ASF: పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయింది: కవిత

కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని BRS ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు బీసీయేతర అభ్యర్థులను బరిలోకి దింపాయని, పార్టీలపరంగా, సిద్ధాంతపరంగా ఓట్లు చీలాయన్నారు. కాబట్టి పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి హరికృష్ణ గెలవలేదని ఆమె అన్నారు. బీసీ రిజర్వేషన్లు ఉంటే ఆ స్థానంలో కచ్చితంగా అన్ని పార్టీలు బీసీకే టికెట్ ఇచ్చేవని వ్యాఖ్యానించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉండాలన్నారు.
Similar News
News March 12, 2026
భీమవరం: హాల్ టికెట్ చూపిస్తే ఉచిత ప్రయాణం

ఈ నెల 16 నుంచి 28 వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. భీమవరం, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో విద్యార్థులు హాల్ టికెట్ చూపించి పల్లె వెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారి గిరిధర్ కుమార్ తెలిపారు. ఇంటి నుంచి పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి ఈ సదుపాయం ఎంతో దోహదపడనుంది.
News March 12, 2026
రాష్ట్రంలోనే ప.గో. జిల్లాకు ఫస్ట్ ర్యాంకు

అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో ప.గో. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సర తృతీయ త్రైమాసికానికి సంబంధించి IVRS ద్వారా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో జిల్లా 74.1 శాతం సానుకూలతతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. జిల్లా యంత్రాంగం సమిష్ఠిగా కృషి చేయడం వల్లే ఈ ఘనత సాధ్యమైందని కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు.
News March 12, 2026
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయంటే!

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో ఇలా ఉన్నాయి.. జక్రాన్‌పల్లి 38.6°C, పెర్కిట్, కోటగిరి, బాల్కొండ, మంచిప్ప, మెండోరా, కొల్లూరు(బాన్సువాడ) 38.4, సోమూరు 38.3, బిచ్కుంద 38.1, నిజామాబాదు సౌత్, ఎల్పుగొండ, మేనూరు 38, మోస్రా 37.9, పెద్దకొడప్గల్ 37.8, జానకంపేట, భిక్కనూరు 37.7, కమ్మర్పల్లి, ఇస్సపల్లి(ఆర్మూర్) 37.6°Cలుగా నమోదయ్యాయి.


