News March 6, 2025
దగ్గుబాటి విశిష్టమైన వ్యక్తి: సీఎం చంద్రబాబు

AP: మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రతి అంశంపై లోతుగా విశ్లేషణ చేస్తారని సీఎం చంద్రబాబు కొనియాడారు. తమ ఫ్యామిలీలో ఆయనొక విశిష్టమైన, సంతోషకరమైన వ్యక్తి అని పేర్కొన్నారు. ఇరు కుటుంబాలు 40 ఏళ్లుగా కలసి ఉన్నాయని చెప్పారు. తామిద్దరం ఎన్టీఆర్ నుంచి స్ఫూర్తి పొందామన్నారు. దగ్గుబాటి రచయిత కాకపోయినా ఎవరూ టచ్ చేయని అంశంపై పుస్తకం రాశారని ప్రశంసించారు.
Similar News
News February 10, 2026
సపోటాలో చెక్క తెగులు – నివారణకు సూచనలు

చెక్క తెగులు ఆశించిన సపోటా చెట్ల కొమ్మలు వంకరులు తిరిగిపోతాయి. ఆకులు రాలిపోయి.. కొమ్మలు ఎండిపోయిన చెక్కలుగా మారతాయి. ఈ తెగులును గుర్తించిన వెంటనే కొమ్మలను కత్తిరించి లీటరు నీటికి 3గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2.5 గ్రాముల మాంకోజెబ్‌ను కలిపి పిచికారీ చేసుకోవాలి. మొక్కల్లో ఇనుప ధాతు లోపం లేకుండా ఉండేందుకు 2గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్, 1గ్రాము నిమ్మ ఉప్పును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
News February 10, 2026
ESIC మోడల్& సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఉద్యోగాలు

కేరళ, కొల్లాంలోని <
News February 10, 2026
ఇంట్లో ఉండకూడని వస్తువులివే..

ఇంట్లో సానుకూల శక్తి పెరగాలంటే కొన్ని వస్తువులను తొలగించాలి. పగిలిన అద్దాలు, పనిచేయని గడియారాలు ఉంచకూడదు. ఇవి ప్రగతిని అడ్డుకుంటాయి. విరిగిన సామాన్లు, చిరిగిన పాత బట్టలు దారిద్ర్యానికి సంకేతాలు. వాడిపోయిన మొక్కలు, ఎండిపోయిన పూలు ఇంట్లో ప్రతికూలతను పెంచుతాయి. యుద్ధం, ఏడుపు, హింసను ప్రతిబింబించే చిత్రాలు గోడలపై ఉండకూడదు. తుప్పు పట్టిన ఇనుప వస్తువులు తొలగించాలి. ఇంటిని శుభ్రంగా, వెలుతురుతో ఉంచాలి.


