News March 6, 2025

రిటైర్మెంట్‌పై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

image

AP: ఒక్కసారిగా రిటైర్మెంట్ జీవితంలోకి మారినా దగ్గుబాటి హ్యాపీగా ఉన్నారని సీఎం చంద్రబాబు చెప్పారు. తనకూ ఆ పరిస్థితి వస్తే సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ఎలా సమయం వెచ్చిస్తున్నారని ఆయనను అడిగానన్నారు. ‘ఉదయాన్నే బ్యాడ్మింటన్, తర్వాత మనవళ్లు, మనవరాళ్లతో ఆటలు, స్నేహితులతో మాటలు, పేకాట, రాత్రి పిల్లలకు కథలు చెప్పి సంతోషంగా నిద్రపోతా అని దగ్గుబాటి చెప్పారు. ఇదో వండర్‌ఫుల్ లైఫ్’ అని పేర్కొన్నారు.

Similar News

News March 6, 2025

బ్యాలెట్‌ విధానంలో ఎన్నికల కోసం డిమాండ్‌ చేయాలి: జగన్

image

కేంద్రం, రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే బ్యాలెట్‌ విధానంలో పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేయాలని YCP MPలకు జగన్ సూచించారు. ‘వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌’‌పై పార్లమెంటులో చర్చ జరిగే అవకాశమున్న నేపథ్యంలో వారికి సూచనలు చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పుడు బ్యాలెట్‌ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని, మొదట్లో EVMలతో నిర్వహించిన దేశాలు కూడా తర్వాత బ్యాలెట్‌ విధానానికి మళ్లాయని గుర్తు చేశారు.

News March 6, 2025

ఇవాళ వే2న్యూస్‌లో ఈ స్టోరీలు చదివారా..?

image

– కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ ఎపిసోడ్
– బాబర్ ఆజమ్‌పై విమర్శలు.. తండ్రి ఆగ్రహం
– YS జగన్‌పై పోలీసులకు ఫిర్యాదు
– సింగర్‌తో BJP MP పెళ్లి.. ఫొటోలు
– ఎగ్జామ్ సిస్టమ్‌ను ఎవరు తయారు చేశారంటే..
– రిటైర్మెంట్‌పై చంద్రబాబు ఏమన్నారంటే
– తమన్నా బ్రేకప్.. కారణమిదే
– తిరుమల అన్న ప్రసాదంలో కొత్తగా..
– ఛాంపియన్స్ ట్రోఫీ: ఈ సారి ఈ పరంపర వద్దు

News March 6, 2025

స్కూళ్లకు వేసవి సెలవులు.. తేదీ ఇదే

image

తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ఉంటాయి. అయితే తెలంగాణలో APR 20, APలో APR 23 నుంచి సమ్మర్ హాలిడేస్ ఉంటాయని పలు కథనాలు వచ్చాయి. దీనిపై ఇరు రాష్ట్రాల విద్యాశాఖ వర్గాలను Way2News సంప్రదించింది. అకడమిక్ క్యాలెండర్ 2024-25 ప్రకారం APR 23 చివరి పనిదినం అని వారి నుంచి సమాధానం వచ్చింది. ఎండల తీవ్రత వంటి కారణాలతో సెలవు తేదీల్లో మార్పులు ఉంటే ప్రకటన చేస్తామన్నాయి.
Share It

error: Content is protected !!