News March 22, 2024
జిల్లాలో పదవ తరగతి గణితం పరీక్ష ప్రశాంతం

పది పరీక్షల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన గణితం పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని జిల్లా విద్యాశాఖాధికారిణి తాహేరా సుల్తానా తెలిపారు. జిల్లాలో మొత్తం 151 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా గణితం పరీక్షకు 21,539 మంది విద్యార్థులకు గానూ 391 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 30 పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షలు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారని డీఈఓ తెలిపారు.
Similar News
News April 16, 2025
గుడివాడ: తమ్ముడి మృతిని తట్టుకోలేక అక్క మృతి

సోదరుడి మృతదేహాన్ని చూసేందుకు విజయవాడ వెళ్లిన మృతుడి సోదరి అంజలి షాక్‌కు గురై చనిపోయిన ఘటన మంగళవారం చోటు చేసుకొంది. స్థానికుల వివరాల మేరకు.. గుడివాడ రూరల్ మండలం దొండపాడుకు చెందిన మాజీ సర్పంచ్ రామాంజనేయులు అనారోగ్యంతో విజయవాడలోని ఓ ఆస్పత్రిలో మృతిచెందారు. ఈయన భార్య గద్దె పుష్పరాణి ప్రస్తుతం గుడివాడ రూరల్ మండల ఎంపీపీగా ఉన్నారు. తమ్ముడి మృతితో అక్క మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News April 16, 2025
కృష్ణా: జిల్లాలో నీటి చౌర్యం కాకుండా చూడండి- కలెక్టర్

వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా, జిల్లాలో ఉన్న 266 సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లను పూర్తిస్థాయిలో నింపాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన తన ఛాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో తాగునీటి స్థితిగతులపై సమీక్షించారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి విడుదలైన నీరు చౌర్యానికి గురి కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. కాలువలపై నిఘా పెంచాలన్నారు.
News April 15, 2025
మచిలీపట్నం: అవనిగడ్డలో మెగా జాబ్ మేళా

ఈ నెల 17న అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. మంగళవారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 19 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులని, ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.