News March 6, 2025

బీబీనగర్: అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

బీబీనగర్ మండల పరిధిలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలిలా.. బ్రాహ్మణపల్లికి వెళ్లేదారిలో కారు, బైక్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Similar News

News March 19, 2026

VZM: చెరువులో దూకి స్టూడెంట్ సూసైడ్

image

చెరువులో దూకి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. స్థానిక ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న బాడంగి మండలం బొత్సవానిపాలెం గ్రామానికి చెందిన బొత్స దిలీప్ కుమార్ కుక్కలవారిపాలెం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను ఇటీవల కొన్ని అప్పులు చేశాడని వాటిని తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News March 19, 2026

ALERT: ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడతాయని APSDMA హెచ్చరించింది. శ్రీకాకుళం, VZM, మన్యం, అల్లూరి, పోలవరం, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, NLR, కర్నూలు, నంద్యాల, ATP, సత్యసాయి, కడప, చిత్తూరు, TPTYలో తేలికపాటి-మోస్తరు వర్షాలు, మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. కాగా చిత్తూరు, కడపలోని పలు ఏరియాల్లో ఇప్పటికే వర్షం కురుస్తోంది.

News March 19, 2026

మగ్గంపై చీర నేతను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్

image

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ, హ్యాండ్లూమ్స్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియాతో కలిసి విజయవాడలో బుధవారం ‘గాంధీ బునకర్ చేనేత మేళా’ను ప్రారంభించారు. పలు ప్రాంతాల హ్యాండ్లూమ్ సంఘాలు ఈ మేళాలో పాల్గొని తమ సంప్రదాయ వస్త్రాలను ప్రదర్శిస్తాయని నిర్వాహకులు కలెక్టర్‌కు తెలిపారు. మేళాలో కలెక్టర్ లక్ష్మీశ, మగ్గంపై చీర నేతను పరిశీలించారు.