News March 6, 2025
ఆళ్లగడ్డలో ఉచితంగా ‘ఛావా’ చిత్రం ప్రదర్శన

ఛత్రపతి శివాజీ కొడుకు జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా‘ చిత్రం ఆళ్లగడ్డలోని రామలక్ష్మి థియేటర్‌లో నేడు ఉచితంగా ప్రదర్శించనున్నారు. మధ్యాహ్నం నుంచి 3 షోలు ప్రదర్శిస్తున్నామని థియేటర్ ప్రొప్రైటర్ అట్లా దిలీప్ కుమార్ రెడ్డి తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా థియేటర్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్క హిందూ సోదరులు సినిమాను చూడాలని ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News March 6, 2025
ప్రపంచంలో బెస్ట్ టీమ్ ఇదేనట.. ఏమంటారు?

ప్రస్తుతం ప్రపంచంలో బెస్ట్ క్రికెట్ టీమ్ ఏదంటే అందరూ చెప్పేది టీమ్ఇండియా పేరు. కానీ, ఆల్‌టైమ్ బెస్ట్ & డేంజరస్ క్రికెట్ టీమ్ మాత్రం ‘2003 ఆస్ట్రేలియన్’ జట్టు అని కొందరు చెబుతుంటారు. ఆసీస్ వరుసగా 1999, 2003, 2007 వరల్డ్ కప్స్ గెలిచింది. అప్పట్లో గిల్ క్రిస్ట్& మాథ్యూ ఓపెనింగ్ అదిరిపోయేదంటున్నారు. రిక్కీ పాంటింగ్ కెప్టెన్సీలో ప్రత్యర్థులకు చుక్కలు కనపడేవని చెప్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News March 6, 2025
భారతి హత్య కేసులో తండ్రి, మరొకరి అరెస్ట్

గుంతకల్లు మండల పరిధిలోని కసాపురంలో వద్ద జరిగిన పరువు హత్యలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తండ్రి రామాంజనేయులు, బావ మారుతి కలిసి భారతి (21)ని హత్య చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన ఆటోను సీజ్ చేశారు. అనంతరం ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. కాగా కూతురు ప్రేమ వివాహం చేసుకుంటానని చెప్పడంతో తండ్రి దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే.
News March 6, 2025
PES విద్యాసంస్థల అధినేత కన్నుమూత

పీఈఎస్ విద్యాసంస్థల అధినేత ప్రొఫెసర్ ఎంఆర్ దొరస్వామి నాయుడు(85) కన్నుమూశారు. చిత్తూరు జిల్లాలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన దొరస్వామి 1972లో బెంగళూరులో 40 మంది విద్యార్థులతో పీఈఎస్ విద్యాసంస్థను ప్రారంభించారు. కర్ణాటక ఎమ్మెల్సీగా, ప్రభుత్వ సలహాదారుడిగా విద్యారంగానికి విశేషంగా కృషి చేశారు. బెంగళూరులోని తన నివాసంలో గురువారం సాయంత్రం దొరస్వామి నాయుడు తుది శ్వాస విడిచారు.