News March 6, 2025

ఆళ్లగడ్డలో ఉచితంగా ‘ఛావా’ చిత్రం ప్రదర్శన

image

ఛత్రపతి శివాజీ కొడుకు జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా‘ చిత్రం ఆళ్లగడ్డలోని రామలక్ష్మి థియేటర్‌లో నేడు ఉచితంగా ప్రదర్శించనున్నారు. మధ్యాహ్నం నుంచి 3 షోలు ప్రదర్శిస్తున్నామని థియేటర్ ప్రొప్రైటర్ అట్లా దిలీప్ కుమార్ రెడ్డి తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా థియేటర్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్క హిందూ సోదరులు సినిమాను చూడాలని ఆయన పిలుపునిచ్చారు.

Similar News

News April 2, 2026

కర్నూలు: పరీక్షలు రద్దు

image

రికార్డ్ అసిస్టెంట్-1, ఫ్రంట్ ఆఫీస్ కో-ఆర్డినేటర్-1 పోస్టులకు ఈ ఏడాది ఫిబ్రవరి 18న నిర్వహించిన రాత పరీక్షలను హైకోర్టు ఆదేశాల మేరకు రద్దు చేస్తున్నట్లు కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులుడు జి.కబర్థి తెలిపారు. త్వరలో మళ్లి రాత పరీక్షల తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. త్వరలో జిల్లా కోర్టు వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని చెప్పారు.

News April 2, 2026

కర్నూలు ఇక నుంచి 68 డివిజన్లు

image

52 డివిజన్లకు పరిమితమైన కర్నూలు నగరపాలక సంస్థకు మరో 16 డివిజన్లు అదనంగా పెంచారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా 68 డివిజన్లుగా మార్పు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ సందర్భంగా కార్పొరేటర్ కావాలనుకుంటున్న అన్ని రాజకీయ పార్టీలోని ఆశావాహులకు ఇదో చక్కటి అవకాశంగా పలువురు అభివర్ణిస్తున్నారు.

News April 1, 2026

మున్సిపాలిటీలలో కౌన్సిలర్ స్థానాల పెంపు

image

రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ ఉత్తర్వుల మేరకు కొన్ని మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ స్థానాలు పెంచారు. ఆదోనిలో 42 స్థానాల నుంచి 52, గూడూరులో 20 నుంచి 23, ఎమ్మిగనూరులో 35 నుంచి 44, డోన్‌లో 32 నుంచి 36కు పెరిగాయి. జనాభా పెరుగుదల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల కోసం వార్డుల పునర్విభజన చేపట్టనున్నారు. మున్సిపల్ పరిపాలన కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.