News March 6, 2025

BIG BREAKING: హైకోర్టు సంచలన తీర్పు

image

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. లగచర్ల, హకీంపేటలో భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. కాగా భూసేకరణను వ్యతిరేకిస్తూ, ఇక్కడ ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయడంపై అభ్యంతరం చెబుతూ దాఖలైన పిటిషన్లపై పలువురు కోర్టును ఆశ్రయించారు. ఆయా ప్రాంతాల్లో భూసేకరణ సమయంలో ఆందోళనలు జరిగి పలువురిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

Similar News

News April 6, 2026

ఇండస్ట్రీకి ఎక్కువ మంది అమ్మాయిలు రావాలి: సుప్రియ

image

సినీ పరిశ్రమకు ఎక్కువ మంది మహిళలు వస్తే అసమానతలు తొలగిపోతాయని డెకాయిట్ నిర్మాత, నటి సుప్రియ యార్లగడ్డ చెప్పుకొచ్చారు. తమ సినిమాకు ఎంతో మంది మహిళలు పనిచేశారన్నారు. తనకు సినీ నేపథ్యం ఉండటం అదృష్టంగా భావిస్తానని.. అది భరోసానిచ్చిందని చెప్పుకొచ్చారు. శేష్ గత సినిమాల కంటే ‘డెకాయిట్’ భిన్నమైనదని అన్నారు. కొవిడ్ తర్వాత ప్రేక్షకుల్లో మార్పు వచ్చిందని, మంచి సినిమాలకు ఆదరణ దక్కుతోందన్నారు.

News April 6, 2026

భర్తతో వీడియో కాల్.. తమిళ నటి ఆత్మహత్య

image

తమిళ నటి సుభాషిణి(36) ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నైలోని అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకొని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరులో ఉంటున్న భర్తతో వీడియో కాల్‌లో వాగ్వాదం జరిగి క్షణికావేశంలో సూసైడ్ చేసుకున్నట్లు వెల్లడించారు. అపార్ట్‌మెంట్ సెక్యూరిటీని భర్త అలర్ట్ చేసినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. తమిళంలో ‘కాయల్’ సహా పలు సీరియళ్లలో ఆమె నటించారు.

News April 6, 2026

ప్రకాశ్ రాజ్ వివాదాస్పద ట్వీట్.. నెట్టింట విమర్శలు

image

నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ‘స్థాపనా దివస్ సందర్భంగా.. హిందూ ధర్మం ముసుగులో ద్వేషాన్ని పెంచుతూ దేశ ఆర్థిక వ్యవస్థను, సామరస్యాన్ని దెబ్బతీసిన ఫేక్ ఫకీర్’ గుర్తుకు వచ్చారు’ అంటూ ఓ ఫొటోను పోస్ట్ చేశారు. తన శిష్యులకు విద్వేషాన్ని నూరి పోస్తున్న ఆ వ్యక్తి ఎవరో ఊహించాలంటూ నెటిజన్లను కోరారు. PM మోదీని లక్ష్యంగా చేసుకొని పరోక్షంగా విమర్శలు చేస్తున్నారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.