News March 6, 2025

పోలీసుల విచారణకు హాజరైన గోరంట్ల మాధవ్

image

AP: వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విజయవాడ సైబర్ క్రైమ్ పీఎస్‌లో పోలీసుల విచారణకు హాజరయ్యారు. అత్యాచార బాధితుల పేర్లను బయటపెట్టారని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదుతో మాధవ్‌పై కేసు నమోదైంది. ఇలా పేర్లు బయటపెట్టడం నిబంధనలకు విరుద్ధమని గతేడాది నవంబర్ 2న పద్మ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Similar News

News March 12, 2026

కవిత ఇంటికి సీబీఐ అధికారులు

image

TG: మాజీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చేందుకు సీబీఐ అధికారులు హైదరాబాద్‌లోని ఆమె ఇంటికి వచ్చారు. భర్త అనిల్ నోటీసులు తీసుకున్నారు. లిక్కర్ కేసులో ఇటీవల ఆమెకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీన్ని సీబీఐ హైకోర్టులో సవాల్ చేసింది. కాగా, న్యాయస్థానం నోటీసులను నేడు అధికారులు ఆమెకు అందజేశారు. 16న విచారణకు హాజరు కావాలని తెలిపారు.

News March 12, 2026

ఇది కదా రష్యా అంటే..

image

భారత్‌పై రష్యా మరోసారి తన గౌరవాన్ని చాటుకుంది. రష్యా నుంచి ఆయిల్ కొనేందుకు ఇండియాకు తాత్కాలికంగా <<19351259>>పర్మిషన్<<>> ఇచ్చామన్న అమెరికా వ్యాఖ్యలపై మన దేశంలోని రష్యా రాయబారి అలిపోవ్ స్పందించారు. ‘మా నుంచి ఆయిల్ కొనేందుకు ఇండియాకు ఏ దేశ పర్మిషన్ అవసరం లేదు. అమెరికా అధికారులు తమ అసలు రంగును మరోసారి బయటపెట్టారు. అమెరికా ఇతర దేశాలను భాగస్వాములుగా కాకుండా తక్కువస్థాయి దేశాలుగా చూస్తుంది’ అని తెలిపారు.

News March 12, 2026

కిడ్నీలను కాపాడుకుందామా!

image

నేడు ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం. కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే రోజూ కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి. ఆహారంలో ఉప్పు, చక్కెర తగ్గించాలి. బీపీ, షుగర్‌ను నియంత్రణలో ఉంచుకోవాలి. సొంత వైద్యంతో పెయిన్ కిల్లర్స్ వాడటం ప్రమాదకరం. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటే కిడ్నీలను కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. SHARE IT