News March 22, 2024

BJPతో ఉంటే ఏ కేసూ ఉండదు: CM మమత

image

CBI, ED కేసులు ఎదుర్కొంటున్నవారు BJPతో కలిస్తే ఏ కేసులూ ఉండవని పశ్చిమ బెంగాల్ CM మమతా బెనర్జీ అన్నారు. ఆ పార్టీతో సంబంధాలున్నవారు ఎన్ని అక్రమాలు చేసినా శిక్షలుండవని ఆమె ఆరోపించారు. ప్రతిపక్ష CMలను లక్ష్యంగా చేసుకొని అరెస్టులు చేయడం దారుణమని వాపోయారు. కేజ్రీవాల్ అరెస్టును ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళతానని ఆమె పేర్కొన్నారు. ఆయన అరెస్టును ఖండిస్తున్నామని, ఇది అప్రజాస్వామికమని మమత స్పష్టం చేశారు.

Similar News

News January 10, 2025

ఇందిరా గాంధీ చాలా బలహీనమైన వ్యక్తి: కంగన

image

మాజీ PM ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా ‘ఎమర్జెన్సీ’ని కంగనా రనౌత్ తెరకెక్కించారు. ఆ మూవీ ప్రమోషన్ల సందర్భంగా ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఇందిర చాలా బలహీనమైన వ్యక్తి అని నా పరిశోధనలో అర్థమైంది. ఆమె మీద ఆమెకే నమ్మకం లేదు. అందుకే పరిస్థితులపై మరింత నియంత్రణను కోరుకున్నారు. తన మనుగడకు చాలామందిపై ఆధారపడ్డారు. అయితే ఈ సినిమా ద్వారా ఎవరి మనోభావాల్ని దెబ్బతీయాలన్న ఉద్దేశమూ నాకు లేదు’ అని పేర్కొన్నారు.

News January 10, 2025

IMD@150 ఏళ్లు.. సెమినార్‌కు పాక్, బంగ్లాకు ఆహ్వానం

image

1875 జనవరి 15న ప్రారంభమైన భారత వాతావరణ శాఖ‌(IMD)కు 150 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్రం ‘అన్‌డివైడెడ్ ఇండియా’ సెమినార్ నిర్వహించనుంది. ఆ రోజున ప్రత్యేకంగా రూ.150 స్మారక నాణేన్ని విడుదల చేయనుంది. ఈ కార్యక్రమానికి పాక్, బంగ్లాదేశ్‌తోపాటు పొరుగున ఉన్న దేశాలు, మిడిల్ ఈస్ట్, సెంట్రల్, సౌత్ వెస్ట్ దేశాలకు ఆహ్వానం పలికింది. తాము హాజరవుతామని పాక్ తెలపగా, బంగ్లా ఇంకా స్పందించలేదు.

News January 10, 2025

జనవరి 10: చరిత్రలో ఈరోజు

image

* 1894: కవి పింగళి లక్ష్మీకాంతం జననం. 1972లో జనవరి 10నే ఆయన కన్నుమూశారు.
* 1920: నానాజాతి సమితిలో సభ్యత్వం పొందిన భారత్
* 1940: ప్రముఖ గాయకుడు, సంగీత విద్వాంసుడు కేజే ఏసుదాసు పుట్టినరోజు(ఫొటోలో)
* 1973: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి రాష్ట్రపతి పాలన విధించారు.