News March 6, 2025

KMR: ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

image

బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. గ్రామానికి చెందిన శ్రావణ్ కుమార్ మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నట్లు చెప్పారు. మద్యానికి బానిస కావడంతో ఇంటి ముందు ఉన్న చెట్టుకు ఉరేసుకుని మృతి చెందినట్లు ఆయన వివరించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

Similar News

News March 24, 2026

పారదర్శకమైన ఓటరు జాబితాకు సహకరించండి: కలెక్టర్ చిత్రా మిశ్రా

image

ఓటరు జాబితాలో అక్రమాలను తొలగించి, పారదర్శకత పెంచేందుకే ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) చేపట్టిందని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. డూప్లికేట్, మరణించిన, వలస వెళ్లిన ఓటర్ల తొలగింపుపై అపోహలు వద్దన్నారు. రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకుని ఈ ప్రక్రియకు సహకరించాలని కోరారు.

News March 24, 2026

నెల్లూరు జిల్లాలో సదరం స్లాట్ ప్రారంభం

image

నెల్లూరు జిల్లాలో కొన్ని ఏళ్లుగా దివ్యాంగులు సదరం స్లాట్ల బుకింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ప్రక్రియ జిల్లాలోని అన్ని సచివాలయాల్లో మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. సమాచారం అందుకున్న దివ్యాంగులు ఆయా సచివాలయాలకు సమగ్ర వివరాలతో వెళ్లి నమోదు చేయించుకుంటున్నారు. ఆధార్, రేషన్ కార్డు, ఆధార్‌తో లింక్ అయిన ఫోన్ నంబర్ వెంట తీసుకుని వెళ్లాలి.

News March 24, 2026

క్షయ వ్యాధి నిర్మూలనలో భాగస్వామ్యులు కావాలి: జేసీ

image

క్షయ వ్యాధి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని జేసీ నిశాంతి సూచించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద క్షయ వ్యాధి నివారణ దినోత్సవ కార్యక్రమం జరిగింది. జేసీ మాట్లాడుతూ.. టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం ద్వారా జిల్లాలో క్షయ వ్యాధి నివారణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. అధికారులు పాల్గొన్నారు.