News March 6, 2025
‘ప్యారడైజ్’లో నాని లుక్ వెనుక కథ ఇదే!

‘ప్యారడైజ్’ టీజర్‌లో నేచురల్ స్టార్ నాని ఊరమాస్ లుక్‌తో పాటు జడలు వేసుకొని కనిపించారు. అందరినీ ఆకర్షించిన ఆ లుక్‌పై డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల స్పందించారు. రెండు జడలకు, తన బాల్యానికి కనెక్షన్ ఉందని చెప్పారు. చిన్నప్పుడు తనను తల్లి అలాగే జడలు వేసి పెంచిందని, ఆ స్ఫూర్తితోనే నాని పాత్రను డిజైన్ చేశానని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ప్యారడైజ్’ మూవీ 2026 మార్చిలో విడుదల కానుంది.
Similar News
News March 6, 2025
నోటిఫికేషన్ విడుదల

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 357 సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్) పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో BSFలో 24, CRPFలో 204, CISFలో 92, ITBPలో 4, SSBలో 33 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసి, 20-25 ఏళ్ల వయసు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్ టెస్టులు, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 25.
సైట్: upsc.gov.in/
News March 6, 2025
విద్యకు దూరమైన బాలిక.. స్పందించిన సీఎం

TG: బర్త్ సర్టిఫికెట్, ఆధార్ లేదంటూ HYD సనత్‌నగర్‌కు చెందిన శ్రీవిద్య(8)ను స్కూలులో చేర్చుకోలేదన్న వార్తపై CM రేవంత్ స్పందించారు. ‘శ్రీవిద్య సమస్య నా దృష్టికి వచ్చింది. ఆమె పాఠశాలకు వెళ్లకపోవడానికి ఆధార్ లేకపోవడం కారణం కాదని విచారణలో తేలింది. కుటుంబ కారణాల వల్లే ఆమె స్కూలుకు దూరమైంది. అధికారులు ఆమెను తిరిగి స్కూలులో చేర్పించారు. తను మంచిగా చదివి భవిష్యత్తులో గొప్పగా రాణించాలి’ అని ట్వీట్ చేశారు.
News March 6, 2025
రిటైర్మెంట్ నిర్ణయంపై సునీల్ ఛెత్రి యూ టర్న్

భారత ఫుట్‌బాల్ టీమ్ మాజీ కెప్టెన్ సునీల్ ఛెత్రి తన అంతర్జాతీయ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ నెలలో జరిగే FIFA ఇంటర్నేషనల్ మ్యాచుల్లో జాతీయ జట్టుకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తారని ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ వెల్లడించింది. ఈ 40 ఏళ్ల ప్లేయర్.. గత ఏడాది జూన్‌లో రిటైర్మెంట్ ప్రకటించారు. IND తరఫున 151 మ్యాచుల్లో 94 గోల్స్ చేశారు.