News March 6, 2025

కేరళలో ముస్తాబాద్ యువకుడి మృతి

image

ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన ముత్యాల సాయిచరణ్(21) తన స్నేహితులతో కలిసి ఈ నెల 3న కేరళలోని అలప్పుజకు వెళ్లారు. అక్కడ సముద్రంలో హౌస్‌బోట్‌లో వెళ్తుండగా సాయిచరణ్ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు. ఈ నెల 5న సాయిచరణ్ మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. సమీప బంధువైనటువంటి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అంత్యక్రియలకు హాజరయ్యారు.

Similar News

News January 19, 2026

కామారెడ్డి: 23న పేరెంట్స్ మెగా మీటింగ్

image

ఈనెల 23న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల మెగా మీటింగ్ ఉంటుందని కామారెడ్డి జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి షేక్ సలాం తెలిపారు. జిల్లాలోని 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సమావేశానికి హాజరు కావాలని సూచించారు. ప్రతి జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కళాశాల ప్రిన్సిపల్‌లను ఆదేశించారు.

News January 19, 2026

జాతీయ స్థాయికి కర్నూలు పిల్లాడు.!

image

ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు ఒడిశాలోని భువనేశ్వర్ పట్టణంలో నిర్వహిస్తున్న 10వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ రగ్బీ పోటీలకు కర్నూలు ఎస్టీ ఆశ్రమ పాఠశాల విద్యార్థి కే. మధు ఎంపికయ్యారు. ఇటీవల డిసెంబర్ నెలలో కర్నూలులోని ఆదర్శ పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రమ్య సోమవారం వెల్లడించారు.

News January 19, 2026

MHBD: నేటి నుంచి సర్పంచులకు శిక్షణ

image

జిల్లాలో నూతన సర్పంచులకు నేటి నుంచి 6 రోజుల పాటు శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ శిక్షణలో పంచాయతీరాజ్ చట్టం, గ్రామ పాలన, నిధుల వినియోగంపై అవగాహన కల్పిస్తారు. శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటికే రిసోర్స్ పర్సన్లను ఎంపిక చేశారు. జిల్లాలో 482 పంచాయతీల్లో పాలకవర్గాలు కొలువుదీరాయి. వారికి తమ విధులు, బాధ్యతలపై పూర్తి స్థాయిలో శిక్షణ పాఠాలు నేర్పనున్నారు.