News March 6, 2025
సిరిసిల్ల: ఆయుర్వేద వైద్యం పేరుతో మోసం, వ్యక్తి అరెస్టు: డిఎస్పీ

ఆయుర్వేద వైద్యం పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన అజయ్ అనే వ్యక్తి జిల్లాలో పక్షపాతం తగ్గిస్తానని ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశాడన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామన్నారు
Similar News
News March 14, 2026
కడప: నేటి ఇంటర్ పరీక్షలకు 91% మంది విద్యార్థులు హాజరు.!

కడప జిల్లాలో శనివారం 62 సెంటర్లలో ఇంటర్ 1st ఇయర్ సివిక్స్ పేపర్-1 పరీక్షలు జరిగాయి. నేటి పరీక్షలకు 91% మంది విద్యార్థులు హాజరయ్యారు. నేడు 3,723 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 3,397 మంది మాత్రమే హాజరయ్యారు. 326 మంది విద్యార్థులు పరీక్షలకు డుమ్మా కొట్టారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్మీడియట్ అధికారులు తెలిపారు.
News March 14, 2026
FLASH.. కేయూ మాజీ వైస్ ఛాన్స్‌లర్ లింగమూర్తి మృతి

కాకతీయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్‌లర్ లింగమూర్తి ఈరోజు మధ్యాహ్నం 12:20 గం.కు మృతి చెందారు. ఆయనకు భార్య అంజలి, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. గత ఆరు మాసాలుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు నెలలుగా హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్యం క్షీణించడంతో వారం రోజుల క్రితం ఆయన నివాసానికి తీసుకురాగా ఈరోజు తుది శ్వాస విడిచారు.
News March 14, 2026
పెద్దపల్లి: యువతకు మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ ప్రారంభం

పెద్దపల్లి జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మెడికల్ కోడింగ్ & బిల్లింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఈ శిక్షణ మార్చి 16 నుంచి పెద్దపల్లి TASK రీజినల్ సెంటర్‌లో ప్రారంభం కానుందని, ఫార్మసీ, బయోటెక్నాలజీ విద్యార్థులు నమోదు చేసుకోవాలని సూచించారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.


