News March 6, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో 551మంది గైర్హాజరు

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 42 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు నేడు పార్ట్-3లోని పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు జనరల్ విద్యార్థులలో 12,437 మందికి గానూ 11,985 మంది, ఒకేషనల్ విద్యార్థుల్లో 1,644 మందికి గానూ 1,545 మంది హాజరయ్యారు. మొత్తం 551 గైర్హాజరైనట్లు డీఐఈఓ రఘునాథ రెడ్డి తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు.
Similar News
News March 6, 2025
రిటైర్మెంట్ నిర్ణయంపై సునీల్ ఛెత్రి యూ టర్న్

భారత ఫుట్‌బాల్ టీమ్ మాజీ కెప్టెన్ సునీల్ ఛెత్రి తన అంతర్జాతీయ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ నెలలో జరిగే FIFA ఇంటర్నేషనల్ మ్యాచుల్లో జాతీయ జట్టుకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తారని ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ వెల్లడించింది. ఈ 40 ఏళ్ల ప్లేయర్.. గత ఏడాది జూన్‌లో రిటైర్మెంట్ ప్రకటించారు. IND తరఫున 151 మ్యాచుల్లో 94 గోల్స్ చేశారు.
News March 6, 2025
విజయమ్మ, షర్మిల షేర్ల బదిలీ రద్దు చేయాలని జగన్ పిటిషన్

తమ సంతకం లేకుండానే తన, భారతి షేర్లను తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారని, వాటిని రద్దు చేయాలని మాజీ CM జగన్ HYD జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్(NCLT)లో పిటిషన్లు వేశారు. అందులో విజయమ్మ, షర్మిలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. షేర్ల బదిలీపై స్టే కోరుతూ గతవారం జగన్ దాఖలు చేసిన మధ్యంతర, తాజా పిటిషన్లపై కౌంటర్ దాఖలుకు వాద, ప్రతివాదులు గడువు కోరారు. దీంతో APR 3కి విచారణ వాయిదా పడింది.
News March 6, 2025
ఇవాళ అత్యధికంగా 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత

AP: రాష్ట్రంలో సూర్యుడు భగ్గుమన్నాడు. ఇవాళ అనకాపల్లి జిల్లా నాతవరం, తూ.గో. జిల్లా గోకవరం, కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో అత్యధికంగా 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 7 మండలాల్లో తీవ్ర, 68 మండలాల్లో వడగాల్పులు వీచాయని APSDMA పేర్కొంది. శుక్రవారం 84 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని సూచించింది.