News March 6, 2025

ఓటమి మరింత బాధ్యతను పెంచింది: నరేందర్ రెడ్డి

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తనకు మరింత బాధ్యతను పెంచిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టెక్నికల్‌గా తాను ఓడిపోయినప్పటికీ నైతిక విజయం మాత్రం తనదేనని, పట్టభద్రులంతా తనకు అండగా నిలిచి ఓట్లు వేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి వెల్లడించారు.

Similar News

News January 6, 2026

ఓటర్ల జాబితాపై అభ్యంతరాలకు 8 వరకు గడువు: కలెక్టర్

image

పరకాల మున్సిపాలిటీ ఓటర్ల ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల 8లోగా సమర్పించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తప్పులు లేని పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించడమే యంత్రాంగం లక్ష్యమని స్పష్టం చేశారు. ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల ప్రక్రియకు రాజకీయ పార్టీలు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.

News January 6, 2026

యాదాద్రి భువనగిరి కలెక్టర్.. గొప్ప మనసు

image

దత్త విద్యార్థి భరత్ చంద్ర కుటుంబానికి 200 గజాల ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేస్తూ ఇంటి పట్టాను కలెక్టర్ హనుమంతరావు మంగళవారం అందజేశారు. నారాయణపురం మండలం శేరిగూడెం గ్రామానికి చెందిన దత్త విద్యార్థి భరత్ చంద్ర చారి కుటుంబానికి మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులతో పాటు రూ.5000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గతంలో కలెక్టర్ ఇచ్చిన హామీ ప్రకారం.. 200 గజాల స్థలం పట్టాను అందజేశారు.

News January 6, 2026

డాక్టర్‌కూ తప్పని కుల వివక్ష!

image

TG: కులం రక్కసికి ఓ జూనియర్ డాక్టర్ బలైపోయింది. గద్వాల జిల్లాకు చెందిన లావణ్య చిన్నప్పటి నుంచి టాపర్. సిద్దిపేట మెడికల్ కాలేజీలో ఇంటర్న్‌షిప్ చేస్తోంది. సికింద్రాబాద్‌కు చెందిన ప్రణయ్ తేజ్ అనే యువకుడిని ప్రేమించగా అతడు పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇటీవల కులాలు వేరని పెళ్లికి నో చెప్పడంతో ఆమె పాయిజన్ ఇంజెక్షన్ వేసుకొని సూసైడ్ చేసుకుంది. ప్రణయ్‌ను పోలీసులు అరెస్టు చేసి అట్రాసిటీ కేసు పెట్టారు.