News March 6, 2025
ఇకపై ‘మనమిత్ర’లో 200 సేవలు: లోకేశ్

AP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ ‘మన మిత్ర’లో ఇకపై ప్రజలకు 200 సేవలు అందుతాయని మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ‘మన మిత్ర’ అద్భుత మైలురాయి దాటిందన్నారు. ఈ ఏడాది జనవరిలో 161 సేవలతో ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్ మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ గవర్నెన్స్‌కు ఇదో నిదర్శనం అని లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు.
Similar News
News March 27, 2026
చరిత్రలో ఈరోజు (మార్చి 27)

1845: ఎక్స్ కిరణాల ఆవిష్కర్త, నోబెల్ బహుమతి గ్రహీత విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ జననం
1985: సినీ నటుడు రామ్ చరణ్ జననం (ఫొటోలో)
1937: నటి, నృత్య కళాకారిణి రాగిణి జననం
1968: అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి మనిషి యూరీ గగారిన్ మరణం
☛ ప్రపంచ రంగస్థల దినోత్సవం
News March 27, 2026
PV సింధు ప్రత్యర్థి కరోలినా మారిన్ రిటైర్మెంట్

బ్యాడ్మింటన్ స్టార్ కరోలినా మారిన్ 32 ఏళ్లకే ఆటకు గుడ్ బై చెప్పేశారు. 2016 ఒలింపిక్ ఫైనల్లో PV సింధును ఓడించి గోల్డ్ గెలిచిన ఈ స్పెయిన్ ప్లేయర్ 3 సార్లు వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచారు. 2024 పారిస్ ఒలింపిక్స్ సెమీస్‌లో మోకాలి గాయంతో తప్పుకున్నప్పుడే తాను కోర్టులో రిటైర్ అయ్యానంటూ ఎమోషనల్ అయ్యారు. ఉమెన్స్ సింగిల్స్‌లో ఒలింపిక్ గోల్డ్ కొట్టిన ఫస్ట్ నాన్ ఏషియన్ షట్లర్‌గా మారిన్ రికార్డ్ క్రియేట్ చేశారు.
News March 27, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


