News March 6, 2025

ADB: మందు తాగిన దంపతులు.. భర్త మృతి

image

నేరడిగొండ మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వడూర్‌ గ్రామానికి చెందిన రైతు ఈదపు పోశెట్టి (60), అతడి భార్య ఇందిర(52) అప్పుల బాధ భరించలేక గురువారం పురుగు మందు తాగారు. ఈ ఘటనలో పోశెట్టి మృతి చెందగా ఇందిర పరిస్థితి విషమంగా ఉంది. పంట సాగులో నష్టం రావడం, ఇద్దరు పిల్లలకు పెళ్లి చేయడంతో అప్పులు అయ్యాయనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.

Similar News

News March 24, 2026

ఆదాయ పెంపులో జిల్లాను ముందంజలో నిలపాలి: కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో ప్రధాన ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి సారించి, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి నిర్దేశిత వార్షిక లక్ష్యాలను అధిగమించాలని కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖలు సమిష్టిగా కృషి చేసి గత ఆర్థిక సంవత్సరాన్ని మించి లక్ష్యాలను అధిగమించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

HYD: IT కారిడార్‌లో ‘డిజిటల్ కన్ను’!

image

HYD‌లోని IT కారిడార్‌లో సైబరాబాద్ పోలీసులు ప్రయోగాత్మకంగా ‘AI క్రైమ్ ప్రిడిక్షన్’ వ్యవస్థను అమలు చేస్తున్నారు. గత నేరాల డేటాను విశ్లేషించి, రాబోయే 48 గంటల్లో గొడవలు జరిగే ప్రాంతాలను ఇది ముందే పసిగడుతుంది. ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాల ద్వారా అనుమానితుల కదలికలపై నిరంతరం నిఘా ఉంటుంది. అయితే, పబ్లిక్ సేఫ్టీ కోసం వాడుతున్న ఈ టెక్నాలజీ వివరాలను హోమ్ శాఖ ప్రస్తుతానికి అధికారికంగా ధ్రువీకరించలేదు.