News March 6, 2025

పేదరికం లేని సమాజమే సమాజమే లక్ష్యం: కలెక్టర్

image

పేదరికం లేని సమాజమే లక్ష్యంగా పీ4 సర్వే నిర్వహిస్తున్నట్లు అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి రామారావుతో కలిసి అధికారులు సిబ్బందికి వర్చువల్ సమావేశం నిర్వహించారు. పేదరికం నిర్మూలన కోసం ప్రభుత్వం ప్రణాళికయుక్తంగా ముందుకు వెళుతుందన్నారు. పేదల అవసరాలను గుర్తించి వారి సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.

Similar News

News March 6, 2025

తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

image

☛ ఫ్యూచర్ సిటీ బోర్డుకు ఆమోదం
☛ నదీ జలాల అంశంపై ప్రత్యేక కమిటీ వేయాలని నిర్ణయం
☛ ఉగాది నుంచి ‘భూ భారతి’ అమలు
☛ ఈనెల 12 నుంచి 27 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
☛ కొత్తగా 10,950 విలేజ్ లెవల్ ఆఫీసర్ పోస్టులు
☛ కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 217 పోస్టులు
☛ 10 జిల్లా కోర్టులకు 55 పోస్టుల మంజూరు

News March 6, 2025

విశాఖలో జాబ్ మేళాలు

image

SEEDAP ద్వారా ఏపీ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మార్చి 14, 18, 28వ తేదీల్లో మైనారిటీ యువతకు జాబ్ మేళాలు నిర్వహించనున్నారు. 14న భీమిలి గవర్నమెంట్ పాలిటెక్నిక్, వీఎస్ కృష్ణ కాలేజ్, మార్చి 18న గాజువాక గవర్నమెంట్ ఐటీఐ, కంచరపాలెం పాలిటెక్నిక్, మార్చి 28న గాజువాక నాక్ సెంటర్, గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీ, కంచరపాలెం ఓల్డ్ ఐటీఐలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. వివరాలకు esedap.ap.gov.in చూడాలి.

News March 6, 2025

భారత్‌కు ఆదివారం భయం!

image

IND అభిమానులను ఆదివారం భయపెడుతోంది. ఇప్పటివరకు ICC ట్రోఫీల్లో ఆదివారం తప్ప మిగతా రోజుల్లో జరిగిన అన్ని ఫైనల్స్‌లో భారత్ గెలిచింది. 1983 (శనివారం), 2002 CT (సోమవారం), 2007 టీ20 WC (సోమవారం), 2011 వన్డే WC (శనివారం), 2013 CT (సోమవారం), 2024 టీ20 WC (శనివారం) కప్పులు సొంతం చేసుకుంది. 2000 CT, 2014 T20 WC, 2017 CT, 2003, 23 వన్డే WC ఫైనల్స్ ఆదివారం జరగ్గా భారత్ ఓడిపోయింది. ఈసారి CT ఫైనల్ ఆదివారమే మరి!

error: Content is protected !!