News March 6, 2025
పార్వతీపురం:‘తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలి’

వేసవిలో గ్రామాల్లో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా తక్షణ చర్యలు అధికార యంత్రాంగం చేపట్టాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ అన్నారు. గురువారం మండల స్థాయి అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తుగా తాగునీటి ఎద్దడిని గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News March 6, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

☞ కొణిదెల పాఠశాలలో డీఈవో తనిఖీ ☞ అహోబిలం బ్రహ్మోత్సవాలకు 32 ప్రత్యేక బస్సులు ☞ Way2News ఎఫెక్ట్.. శ్రీశైలంలో తొలగిన దుర్వాసన ☞ మహానందిలో అద్భుత శిల్ప సంపద ☞ SDPI కార్యాలయంపై ఈడీ దాడులు ☞ చాగలమర్రిలో బైకులకు నిప్పు ☞ రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం ☞ డాక్టర్ పట్టా అందుకున్న ఎంబాయి విద్యార్థి ☞ బెలూం శింగవరంలో భార్యపై రోకలితో దాడి.. మృతి ☞ ALGలో ఉచితంగా ‘ఛావా’ చిత్ర ప్రదర్శన
News March 6, 2025
తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

☛ ఫ్యూచర్ సిటీ బోర్డుకు ఆమోదం
☛ నదీ జలాల అంశంపై ప్రత్యేక కమిటీ వేయాలని నిర్ణయం
☛ ఉగాది నుంచి ‘భూ భారతి’ అమలు
☛ ఈనెల 12 నుంచి 27 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
☛ కొత్తగా 10,950 విలేజ్ లెవల్ ఆఫీసర్ పోస్టులు
☛ కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 217 పోస్టులు
☛ 10 జిల్లా కోర్టులకు 55 పోస్టుల మంజూరు
News March 6, 2025
విశాఖలో జాబ్ మేళాలు

SEEDAP ద్వారా ఏపీ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మార్చి 14, 18, 28వ తేదీల్లో మైనారిటీ యువతకు జాబ్ మేళాలు నిర్వహించనున్నారు. 14న భీమిలి గవర్నమెంట్ పాలిటెక్నిక్, వీఎస్ కృష్ణ కాలేజ్, మార్చి 18న గాజువాక గవర్నమెంట్ ఐటీఐ, కంచరపాలెం పాలిటెక్నిక్, మార్చి 28న గాజువాక నాక్ సెంటర్, గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీ, కంచరపాలెం ఓల్డ్ ఐటీఐలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. వివరాలకు esedap.ap.gov.in చూడాలి.