News March 6, 2025
చాపాడు: భార్యను గొడ్డలితో నరికిన భర్త

చాపాడు మండలం నక్కలదిన్నె సమీపంలో గురువారం మధ్యాహ్నం భార్యను భర్త యెర్రిబోయిన భాస్కర్ గొడ్డలితో నరికాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భార్యపై అనుమానంతో భర్త ఈ ఘాతకానికి పాల్పడినట్లు గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. ట్రైనీ డీఎస్పీ భవానీ, ఎస్సై చిన్న పెద్దయ్య ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 4, 2026
కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఖరారు

కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్.డి. విజయ జ్యోతిని రెండవసారి నియమించారు. ఈ నియామకాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. జిల్లా స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తనపై మరోసారి నమ్మకం ఉంచిన అధిష్ఠానానికి విజయ జ్యోతి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని ఆమె తెలిపారు.

కడప జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా విజయ జ్యోతి