News March 6, 2025
బాపట్ల జిల్లాలో భగ్గుమంటున్న ఎండలు

బాపట్ల జిల్లాలో మార్చి నెల ప్రారంభంలోనే ఎండలు మండుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో గురువారం 39డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అమృతలూరు, కొల్లూరు, వేమూరు, చుండూరు, చిన్నగంజాం, రేపల్లె, భట్టిప్రోలు మండలాల్లో 39డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యుంది. వేడిగాలులు వీస్తుండడంతో ఇంటర్, 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Similar News
News July 7, 2025
ఒంగోలు నుంచి వెళ్తుండగా ఉద్యోగి మృతి

ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సోమవారం ఉదయం చనిపోయారు. ఒంగోలు నుంచి బైకుపై వెళ్తున్న వ్యక్తి జాగర్లమూడివారిపాలెం బ్రిడ్జి వద్ద హైవేపై చనిపోయారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందా? లేదా అదుపుతప్పి ఆయనే కింద పడిపోయారా? అనేది తెలియాల్సి ఉంది. మృతుడు ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అని సమాచారం. ఒంగోలు నుంచి గుంటూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
News July 7, 2025
NLG: ఉచిత శిక్షణ దరఖాస్తులకు నేడే ఆఖరు

ఎస్సీ, స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికిగాను సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి బి. శశికళ తెలిపారు. డిగ్రీ ఉతీర్ణులైన SC, ST, BC (BCE, PWD) కులాలకు చెందిన ఆసక్తి గల అభ్యర్థులు www.tsstudycircle.co.in వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 7లోగా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. 13న రాత పరీక్ష ఉంటుందన్నారు.
News July 7, 2025
నిజాంపేట్: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

నిజాంపేట్ మండలానికి చెందిన గంగరబోయిన అంజమ్మ(45) ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. నిజాంపేట్ నుంచి హైదరాబాద్‌కు బైక్‌పై వెళ్తుండగా అల్లాదుర్గ్ శివారులో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. తలకు తీవ్రంగా గాయాలు కావడంతో స్థానికులు ఆమెను జోగిపేట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.