News March 6, 2025
రాహుల్‌ను స్పేర్ టైర్ కంటే దారుణంగా వాడారు: సిద్ధూ

భారత క్రికెటర్ KL రాహుల్‌పై మాజీ ప్లేయర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రశంసల వర్షం కురిపించారు. కెప్టెన్ ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలని కోరినా సిద్ధంగా ఉండే నిస్వార్థమైన ప్లేయర్ అన్నారు. T20ల్లో ఓపెనర్‌గా, BGTలో పేసర్లను ఎదుర్కొనేందుకు 3వ స్థానంలో, CTలో కీపింగ్‌తో పాటు 6వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇలా రాహుల్‌ను స్పేర్ టైర్ కంటే దారుణంగా వాడారని మేనేజ్‌మెంట్‌కు సెటైర్ వేశారు.
Similar News
News March 6, 2025
విద్యకు దూరమైన బాలిక.. స్పందించిన సీఎం

TG: బర్త్ సర్టిఫికెట్, ఆధార్ లేదంటూ HYD సనత్‌నగర్‌కు చెందిన శ్రీవిద్య(8)ను స్కూలులో చేర్చుకోలేదన్న వార్తపై CM రేవంత్ స్పందించారు. ‘శ్రీవిద్య సమస్య నా దృష్టికి వచ్చింది. ఆమె పాఠశాలకు వెళ్లకపోవడానికి ఆధార్ లేకపోవడం కారణం కాదని విచారణలో తేలింది. కుటుంబ కారణాల వల్లే ఆమె స్కూలుకు దూరమైంది. అధికారులు ఆమెను తిరిగి స్కూలులో చేర్పించారు. తను మంచిగా చదివి భవిష్యత్తులో గొప్పగా రాణించాలి’ అని ట్వీట్ చేశారు.
News March 6, 2025
రిటైర్మెంట్ నిర్ణయంపై సునీల్ ఛెత్రి యూ టర్న్

భారత ఫుట్‌బాల్ టీమ్ మాజీ కెప్టెన్ సునీల్ ఛెత్రి తన అంతర్జాతీయ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ నెలలో జరిగే FIFA ఇంటర్నేషనల్ మ్యాచుల్లో జాతీయ జట్టుకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తారని ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ వెల్లడించింది. ఈ 40 ఏళ్ల ప్లేయర్.. గత ఏడాది జూన్‌లో రిటైర్మెంట్ ప్రకటించారు. IND తరఫున 151 మ్యాచుల్లో 94 గోల్స్ చేశారు.
News March 6, 2025
విజయమ్మ, షర్మిల షేర్ల బదిలీ రద్దు చేయాలని జగన్ పిటిషన్

తమ సంతకం లేకుండానే తన, భారతి షేర్లను తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారని, వాటిని రద్దు చేయాలని మాజీ CM జగన్ HYD జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్(NCLT)లో పిటిషన్లు వేశారు. అందులో విజయమ్మ, షర్మిలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. షేర్ల బదిలీపై స్టే కోరుతూ గతవారం జగన్ దాఖలు చేసిన మధ్యంతర, తాజా పిటిషన్లపై కౌంటర్ దాఖలుకు వాద, ప్రతివాదులు గడువు కోరారు. దీంతో APR 3కి విచారణ వాయిదా పడింది.