News March 6, 2025

GWL: ఒకవైపు తండ్రి మృతి.. మరోవైపు పరీక్ష

image

అయ్యో.. కాలం ఆ ఇంటర్ విద్యార్థికి ఎంతటి కఠిన పరీక్ష పెట్టిందో..! ఒకవైపు ఇంటర్ పరీక్షలు, మరోవైపు తండ్రి మృతదేహం. నాన్న దూరమయ్యాడన్న దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని పరీక్ష రాసేందుకు ఓ విద్యార్థి వెళ్లిన ఘటన గద్వాల జిల్లా అల్లంపూర్ మండలంలోని లింగన్వాయిలో జరిగింది. గ్రామానికి చెందిన మహబూబ్ బాషా కుమారుడు సమీర్ దేవరకద్రలో గురుకులలో ఇంటర్ పరీక్ష రాసి అంత్యక్రియలో పాల్గొనడం అందరిని కంటతడి పెట్టించింది.

Similar News

News January 21, 2026

పల్నాడు: ‘రెవెన్యూ సమస్యలను వేగంగా పరిష్కరించాలి’

image

పల్నాడు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యలను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర భూపరిపాలన కమిషనర్ (సీసీఎల్ఏ) నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్, భూ సర్వేలు, ప్రభుత్వ ప్రాధాన్యత పనులు సకాలంలో పూర్తిచేయాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ సేవలు సమర్థంగా అందించాలని పేర్కొన్నారు.

News January 21, 2026

జనవరి 21: చరిత్రలో ఈరోజు

image

1924: సోవియట్ యూనియన్ వ్యవస్థాపకుడు వ్లాదిమిర్ లెనిన్ మరణం
1950: ప్రముఖ బ్రిటిష్ రచయిత జార్జ్ ఆర్వెల్ మరణం
1952: సినీనటుడు ప్రదీప్ రావత్ జననం
1986: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(ఫొటోలో) జననం
2011: తెలుగు సినీ దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ మరణం
1972: త్రిపుర, మణిపుర్, మేఘాలయ రాష్ట్రాల ఆవిర్భావం

News January 21, 2026

అర్హుల నుంచి టెండర్లకు ఆహ్వానం

image

హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అవసరమైన ప్రయోగశాల సామాగ్రి సరఫరా చేయుటకు దరఖాస్తుదారుల నుంచి టెండర్లను స్వీకరించనునట్లు డీఐఈఓ గోపాల్ తెలిపారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రంలోగా అర్హులైన దరఖాస్తుదారులు హనుమకొండ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని డీఐఈఓ సూచించారు.