News March 6, 2025
KMR: సారీ మమ్మీ, డాడీ.. ఇక సెలవు

కోరుకున్న ఉద్యోగం రాలేదని మనస్తాపానికి గురై ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన ఈ నెల 3న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిట్లం మండలం కోమటి చెర్వు తండాకు చెందిన అశోక్ HYDలో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. 3వతేదీన ఇంటి నుంచి వెళ్లి పోయాడు. ‘కోరుకున్న జాబ్ సాధించలేక పోయా.. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎపుడప్పుడూ చనిపోవాలని ధ్యాస ఒక్కటే.. ఇక సెలవు. సారీ మమ్మీ, డాడీ’ అంటూ లేఖ రాసి అదృశ్యమయ్యాడు.
Similar News
News March 8, 2026
NZB: 246 కేసులు.. రూ 20.30 లక్షల జరిమానా: CP

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన రెండు వారాల్లో 246 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. కేసుల్లో పట్టుబడిన వారిని కోర్టుల్లో హాజరు పరచగా రూ.20.30 లక్షల జరిమానా విధించడం జరిగిందన్నారు. అలాగే 16 మందికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని CP వివరించారు.
News March 8, 2026
చరిత్రలో ఈరోజు (మార్చి 8)

1897: చిత్రకారుడు దామెర్ల రామారావు జననం
1917: విద్యుత్తు రంగ నిపుణుడు నార్ల తాతారావు జననం
1989: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ జననం
1993: చిలకలూరిపేట బస్సు దహనం ఘటనలో 23 మంది మృతి
2012: సినీ నటి రాధాకుమారి మరణం
☛ అంతర్జాతీయ మహిళా దినోత్సవం
News March 8, 2026
కామారెడ్డి: చిన్నారుల మిస్సింగ్.. విషాదాంతం..!

కామారెడ్డి ఆర్బీనగర్ కాలనీలో అదృశ్యమైన <<19324752>>ముగ్గురు చిన్నారులూ<<>> మృతి చెందారు. అక్కచెల్లెలైన సిపత్ (8), అయాత్ (7), మరియం(5) కామారెడ్డి సమీపంలో విగతజీవులుగా కనిపించారు. ఇప్పటికే ఇద్దరి మృతదేహాలను గుర్తించగా.. కొద్దిసేపటి క్రితమే సిపత్ డెడ్‌బాడీ లభ్యమయ్యింది. కాగా పోలీసుల అదుపులో చిన్నారుల తండ్రి ఉన్నట్లు సమాచారం.


