News March 6, 2025
సంగారెడ్డి: ఇంటర్ విద్యార్థులారా.. ఇది మీ కోసమే..!

ఇంటర్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు ఖాళీ కడుపుతో రాకుండా త్వరగా జీర్ణం అయ్యే ఆహారాలైన ఇడ్లీ లేదా చద్దన్నం లాంటివి తిని రావాలని సంగారెడ్డి జిల్లా వైద్యాధికారులు సూచిస్తున్నారు. అలాగే ఎక్కువగా నీరు తాగుతుండాలన్నారు. పరీక్షలు రాసే సమయంలో ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బంది అనిపిస్తే సెంటర్‌లో అందుబాటులో ఉండే హెల్త్ అసిస్టెంట్‌లను సంప్రదించవచ్చని తెలిపారు. ప్రతిరోజు కనీసం 8గంటల నిద్ర ఉండాలన్నారు.
Similar News
News March 7, 2025
తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు

*HYDలో మిస్ వరల్డ్ పోటీల ఆతిథ్యానికి ఆమోదం
*ORRకు ఇన్నర్ సైడ్ ప్రాంతం కోర్ తెలంగాణ.. ORR నుంచి RRR వరకు అర్బన్ తెలంగాణ. మిగతా ప్రాంతమంతా రూరల్ తెలంగాణ
*సెర్ప్, మెప్మాల విలీనం
*మహిళా సంఘాల వయోపరిమితి 15-65 ఏళ్లుగా నిర్ణయం
*డీలిమిటేషన్ అంశంపై అఖిలపక్ష సమావేశం
*యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
News March 7, 2025
30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ: మంత్రి పొంగులేటి

TG: ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని క్యాబినెట్ భేటీలో నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దీని కోసం ప్రత్యేకంగా 90 పోస్టులు మంజూరు చేశామని చెప్పారు. 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 గ్రామాలతో HMDAను విస్తరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. HMDA పరిధిలో కొత్తగా 332 రెవెన్యూ గ్రామాలు ఏర్పాటు చేస్తామన్నారు.
News March 7, 2025
మహిళా సదస్సు ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి సమీక్ష

ఈ నెల 8న పరేడ్ గ్రౌండ్‌లో జరగనున్న మహిళా సదస్సు ఏర్పాట్లను బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులతో సమావేశమై సమీక్షించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సదస్సు అవసరమైన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, వసతులు తదితర అంశాలను చర్చించారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులకు బైసన్‌పోల్ మైదానంలో పార్కింగ్ ఏర్పాటు చేయాలని, మహిళలకు మజ్జిగప్యాకెట్లు అందించాలన్నారు.