News March 6, 2025
ఖమ్మం: కాయిన్ మింగిన నాలుగేళ్ల చిన్నారి

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పాండురంగాపురంలో నాలుగేళ్ల చిన్నారి ఆడుకుంటూ కాయిన్ మింగేశాడు. మోతీలాల్- శైలజ కుమారుడు ప్రద్యుత్ ఐదు రూపాయల కాయిన్‌తో ఆడుకుంటూ.. నోట్లో పెట్టుకుని మింగడంతో అది గొంతులో ఇరుక్కుపోయింది. చిన్నారిని తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. చిన్నారిని పరీక్షించిన డాక్టర్లు గొంతులోని కాయిన్‌ను ఎండోస్కోపీ ద్వారా ఆపరేషన్ లేకుండా బయటకు తీసి ప్రాణాలు కాపాడారు.
Similar News
News March 24, 2026
మార్చి 24: చరిత్రలో ఈరోజు

1603: బ్రిటిషు మహారాణి ఎలిజబెత్ మరణం
1775: కవి, వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితులు జననం
1882: క్షయ వ్యాధికి కారణమైన మైకోబాక్టీరియా ట్యుబర్‌క్యులాసిస్‌ను రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు
1977: భారత ప్రధానిగా మొరార్జీ దేశాయ్ బాధ్యతలు (ఫొటోలో)
1984 : భారత హాకీ క్రీడాకారుడు ఆడ్రియన్ డిసౌజా జననం
1991: సినీ గేయ రచయిత చెరువు ఆంజనేయ శాస్త్రి మరణం
* ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం
News March 24, 2026
వరంగల్ పరిధిలో 41 ట్రాఫిక్ ఉల్లంఘన కేసు నమోదు

వరంగల్ నగరంలో సోమవారం పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 41 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 36మందిని, లైసెన్స్ లేని మరో ఐదుగురుని పట్టుకున్నట్లు సీఐ సుజాత తెలిపారు. నిందితులకు కోర్టు జరిమానా విధించడంతో పాటు కౌన్సెలింగ్ ఇచ్చారు. వాహనదారులు నిబంధనలు పాటించాలని, అతిక్రమిస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
News March 24, 2026
జనగామ: వలకు చిక్కిన 25 కిలోల భారీ బంగారు తీగ

రఘునాథపల్లి మండలంలోని ఇబ్రహీంపూర్ పెద్ద చెరువులో సోమవారం మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. సుమారు 25 కిలోల బరువున్న బంగారు తీగ రకం చేప పడటంతో గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు పెద్ద సంఖ్యలో చెరువు వద్దకు చేరుకుని చేపను ఆసక్తిగా వీక్షించారు. సాధారణంగా ఇంత పెద్ద పరిమాణంలో చేపలు కనిపించడం అరుదని, ఇది గ్రామంలో చర్చనీయాంశంగా మారిందని స్థానికులు తెలిపారు.


