News March 6, 2025
గూడూరు వద్ద ప్రమాదం.. డ్రైవర్ మృతి

విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై చిట్టి గూడూరు వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి టాటా మ్యాజిక్ వాహనం ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో టాటా మ్యాజిక్ డ్రైవర్ బొల్లా మోహన్ రావు దుర్మరణం చెందారు. వాహనంలో ఉన్న ప్యాసింజర్లకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Similar News
News March 27, 2026
కృష్ణా: ఖరీఫ్ ధాన్యం సేకరణపై కలెక్టర్ సమీక్ష

ధాన్యం కొనుగోళ్లలో రైతుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
గురువారం మచిలీపట్నం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖాధికారులతో సమావేశమైన కలెక్టర్ ధాన్యం సేకరణపై సమీక్షించారు. జిల్లాలో 54,678 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. ధాన్యం సేకరణకు అవసరమైన కేంద్రాల ఏర్పాటు, సాంకేతిక సిబ్బంది నియామకంతో పాటు వారికి పూర్తి అవగాహన కల్పించాలన్నారు.
News March 26, 2026
కృష్ణా: ‘అన్ని ప్రభుత్వ సంస్థల్లో స్వచ్ఛ ఆంధ్ర నిర్వహించాలి’

నాల్గో శనివారం సందర్భంగా ఈ నెల 28న జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, అపార్ట్‌మెంట్లలో స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం మచిలీపట్నంలోని తన చాంబర్ నుంచి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి ఒక్కరు పరిశరాల శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.