News March 6, 2025

విశాఖ: ఫోన్ కోసం కుమార్తెతో గొడవ.. తండ్రి సూసైడ్

image

విశాఖలో పురుగు మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. ఆరిలోవ ఎస్‌ఐ వై.కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఆరిలోవ దుర్గా బజారుకు చెందిన బి.మణికంఠకు పదో తరగతి చదువుతున్న కుమార్తె ఉంది. ఫోన్ విషయంలో తండ్రి, కూతురి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన మణికంఠ ఫిబ్రవరి 24న పురుగుల మందు తాగాడు. ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Similar News

News March 7, 2025

విశాఖలో టుడే టాప్ న్యూస్

image

➤ విశాఖలో ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ చేసిన నేతలు ➤ ఏప్రిల్ 10వ తేదీన సింహాద్రి అప్పన్న చందనోత్సవం ➤ హనుమంతువాకలో యాక్సిడెంట్ ఒకరు మృతి ➤ మల్కాపురం పరిధిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం ➤ ఏయూ వీసీతో నన్నయ్య యునివర్సిటీ వీసీ భేటీ ➤ విశాఖలో ఈ నెల 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ ➤ ఏయూను సందర్శించిన ఎన్.హెచ్.ఆర్.సి సభ్యురాలు

News March 6, 2025

విశాఖలో జాబ్ మేళాలు

image

SEEDAP ద్వారా ఏపీ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మార్చి 14, 18, 28వ తేదీల్లో మైనారిటీ యువతకు జాబ్ మేళాలు నిర్వహించనున్నారు. 14న భీమిలి గవర్నమెంట్ పాలిటెక్నిక్, వీఎస్ కృష్ణ కాలేజ్, మార్చి 18న గాజువాక గవర్నమెంట్ ఐటీఐ, కంచరపాలెం పాలిటెక్నిక్, మార్చి 28న గాజువాక నాక్ సెంటర్, గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీ, కంచరపాలెం ఓల్డ్ ఐటీఐలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. వివరాలకు esedap.ap.gov.in చూడాలి.

News March 6, 2025

హనుమంతవాక జంక్షన్లో యాక్సిడెంట్

image

హనుమంతవాక జంక్షన్లో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున అతివేగంగా వెళ్తున్న ఇద్దరు యువకులు మృతి చెందిన సంగతి తెలిసిందే. వరుస ఘటనలో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

error: Content is protected !!