News March 6, 2025
NLG: తెలంగాణ ఐసెట్ 2025 నోటిఫికేషన్ విడుదల

NLG MGUలో ఐసెట్ 2025 నోటిఫికేషన్ను సెట్ ఛైర్మన్, ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్, కన్వీనర్ అల్వాల రవి విడుదల చేశారు. జూన్ 8, 9వ తేదీల్లో 4 విడతలుగా తెలంగాణ వ్యాప్తంగా 16 ఆన్లైన్ పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు కన్వీనర్ ఆచార్య అల్వాల రవి తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తులు మార్చి 10 నుంచి మే 3 వరకు సమర్పించవచ్చును. పూర్తి వివరాలకు https://icet.tsche.ac.inను సందర్శించాలన్నారు.
Similar News
News March 7, 2025
ఆదిలాబాద్: విద్యుత్ వినియోగదారులకు సూచనలు

ఇటీవల కొంతమంది వ్యక్తులు మీటర్ తిరగకుండా చేస్తామని వినియోగదారుల వద్దకు వచ్చి డబ్బులు తీసుకొని మీటర్లోని కొన్ని వైర్లను కట్ చేసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆదిలాబాద్ V&APTS సీఐ ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, ఇలా చేయడం విద్యుత్ శాఖ పరంగా, చట్ట రీత్యా నేరంగా పరిగణించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు అలాంటి వ్యక్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు.
News March 7, 2025
ములుగు: ఇన్స్పైర్ అవార్డు ఎంపికైన మధునిత

ములుగు పట్టణానికి చెందిన తీర్థాల రామన్న కూతురు మధునిత 2024-2025 విద్యా సంవత్సరానికి ఇన్స్పైర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆటోమేటిక్ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ వెహికల్ యూజింగ్ ప్రదర్శనకు అవార్డు పొందినట్లు తల్లిదండ్రులు తెలిపారు. సైన్స్ ఫెయిర్లో ప్రతిభ కనబరిచిన మధునితను పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికులు అభినందించారు.
News March 7, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

మార్చి 7, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 5.18 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.30 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.27 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.24 గంటలకు
ఇష: రాత్రి 7.36 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.