News March 6, 2025
NLG: తెలంగాణ ఐసెట్ 2025 నోటిఫికేషన్ విడుదల

NLG MGUలో ఐసెట్ 2025 నోటిఫికేషన్‌ను సెట్ ఛైర్మన్, ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్, కన్వీనర్ అల్వాల రవి విడుదల చేశారు. జూన్ 8, 9వ తేదీల్లో 4 విడతలుగా తెలంగాణ వ్యాప్తంగా 16 ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు కన్వీనర్ ఆచార్య అల్వాల రవి తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 10 నుంచి మే 3 వరకు సమర్పించవచ్చును. పూర్తి వివరాలకు https://icet.tsche.ac.inను సందర్శించాలన్నారు.
Similar News
News March 7, 2025
జనగామ: విద్యార్థులకు ముఖ్య గమనిక

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి పాఠశాల, కళశాలల్లో ప్రవేశం పొందేందుకు గడువు పొడిగించారు. 5 నుంచి 8వ తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశం పొందేందుకు మార్చి 31వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి విక్రమ్ కుమార్ తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు
News March 7, 2025
శుభ ముహూర్తం (07-03-2025)

☛ తిథి: శుక్ల అష్టమి, మ.1.41 వరకు
☛ నక్షత్రం: మృగశిర, తె.3.19 వరకు
☛ శుభ సమయం: ఏమీ లేవు
☛ రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
☛ యమగండం: మ.3.00 నుంచి 4.30 వరకు
☛ దుర్ముహూర్తం: ఉ.8.24-నుంచి 9.12 వరకు, మ.12.24 నుంచి 1.12 వరకు
☛ వర్జ్యం: ఉ.9.45 నుంచి 10.16 వరకు
☛ అమృత ఘడియలు: రా.7.06 గంటల నుంచి 8.36 వరకు
News March 7, 2025
పిల్లలతో అన్నమయ్య ఎస్పీ

‘మహిళల అభివృద్ధి, సాధికారత, సమానత్వం కోసం కృషి చేద్దాం’ అని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు. మహిళల భద్రత, రక్షణ, సమానత్వం, అభివృద్ధి, సాధికారత కోసం కృషి చేయాలన్న సంకల్పంతో జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు.