News March 6, 2025

రన్యారావు తండ్రిపై గతంలో ఆరోపణలు

image

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన నటి <<15652905>>రన్యారావు<<>> తండ్రి రామచంద్రరావు (DGP) కర్ణాటక హౌసింగ్ కార్పొరేషన్ CMDగా ఉన్నారు. 2014లో ఈయన IGPగా ఉన్నప్పుడు కేరళకు వెళ్తున్న బస్సును మైసూరు దగ్గర ఆపి రూ.20 లక్షల నగదును సీజ్ చేశారు. అయితే అందులో రూ.2.27 కోట్లు ఉన్నాయని, పోలీసులు డబ్బును పక్కదారి పట్టించారని ఆ వ్యాపారులు వెల్లడించారు. ఈ కేసును సీఐడీ విచారించింది. కొన్ని రోజులకు ఆయనకు వేరే పోస్టింగ్ ఇచ్చారు.

Similar News

News January 21, 2026

ఆరావళి అక్రమ మైనింగ్.. కోలుకోలేని నష్టమన్న SC

image

ఆరావళి పర్వతాల్లో అక్రమ మైనింగ్‌పై రివ్యూ చేసేందుకు ఎక్స్‌పర్ట్ కమిటీని నియమిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. అక్రమ మైనింగ్ కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుందని వ్యాఖ్యానించింది. కమిటీ కోసం పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తల పేర్లను 4 వారాల్లోగా ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. నిపుణుల కమిటీ తమ పర్యవేక్షణలో పనిచేస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. కొత్తగా మైనింగ్ లీజులను మంజూరు చేయడాన్ని నిషేధించింది.

News January 21, 2026

ఎక్కువ కాలం జీవించాలంటే ఇలా చేయండి!

image

మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామనేది మన ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడూ సంతోషంగా, పాజిటివ్‌గా ఉండేవారు ఎక్కువ కాలం జీవిస్తారని పరిశోధనల్లో తేలిందని వివరిస్తున్నారు. అతిగా ఆందోళన చెందడం, నెగటివ్ ఆలోచనల వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఇది త్వరగా రోగాల బారిన పడేలా చేస్తుందని, అందుకే ఒత్తిడిని తగ్గించుకుని ప్రశాంతంగా ఉండాలని సూచిస్తున్నారు. SHARE IT

News January 21, 2026

ఇంటి వద్దే FIR.. తొలి కేసు నమోదు

image

TG: ‘FIR ఎట్ డోర్ స్టెప్’లో భాగంగా తొలి కేసు నమోదు చేసినట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. రంగారెడ్డి(D) గాగిల్లాపూర్‌కు చెందిన వ్యక్తి తన విల్లాలో దొంగతనం జరిగినట్లు డయల్ 100కి ఫిర్యాదు చేయడంతో బాధితుడి ఇంటికి వెళ్లి FIR నమోదు చేశామన్నారు. మహిళలు, పిల్లలపై దాడులు, పోక్సో, దొంగతనాలు, చైన్ స్నాచింగ్, బాల్య వివాహాల వంటి ప్రత్యేక సందర్భాల్లో బాధితుల ఇంటి వద్దే కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు.