News March 6, 2025
చికిత్స పొందుతూ రెండో విద్యార్థి కూడా మృతి

పుత్తూరు మండలం నేషనూరు గ్రామంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థి రవితేజ(17) మృతి చెందగా మరో విద్యార్థి మునికుమార్(18) తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం చికిత్స పొందుతూ ముని కుమార్ కూడా మృతి చెందాడు. విద్యార్థులు కాలేజీకి బైకు మీద వెళుతుండగా ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగిన విషయం తెలిసిందే. చనిపోయిన ఇద్దరూ అన్న దమ్ములు కావడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News March 7, 2025
సిర్పూర్ (టి): వంతెన పైనుంచి నదిలో పడి వ్యక్తి మృతి

మహారాష్ట్రలోని పొడ్స గ్రామం మధ్యలోని నది వంతెన పైనుంచి పడి వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఎస్ఐ కమలాకర్ వివరాల ప్రకారం.. కాగజ్ నగర్ మండలం ఇస్గాంకు చెందిన ప్రశాంత్ (39) వ్యాపార నిమిత్తం మహారాష్ట్రలోని ధాబా గ్రామానికి వెళ్లాడు. తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు నదిలో పడి చనిపోయినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
News March 7, 2025
MHBD: పోలీస్ స్టేషన్లో ఖాకీల మందు పార్టీ

మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండల పోలీస్ స్టేషన్లోనే హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ మందు పార్టీ చేసుకోవడం వివాదాస్పదమైంది. బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు గురువారం సోషల్ మీడియాలో వైరలయ్యాయి. పోలీస్ స్టేషన్ అధికారుల తీరుపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ విచారణ జరిపి సదరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
News March 7, 2025
ముత్తన్నపేట: అప్పుల బాధతో వ్యక్తి మృతి.. కేసు నమోదు

ముత్తన్నపేట గ్రామానికి చెందిన రవి (45) వ్యవసాయానికి చేసిన అప్పులు, పిల్లల చదువుల ఫీజులు చెల్లించలేక బుధవారం సాయంత్రం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని బెజ్జంకి ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపారు. పురుగుల మందు సేవించిన ఆయనను కరీంనగర్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా అప్పటికే మృతి చెందినట్లు మృతుడి భార్య రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.