News March 6, 2025

NRPT: మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం

image

మన్యంకొండ వద్ద మిషన్ భగీరథ పైప్‌లైన్ మరమ్మతుల కారణంగా 24 గంటల పాటు తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు కార్యనిర్వహణ అధికారి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈనెల 8న శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరా ఉండదని చెప్పారు. నారాయణపేట, మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాల్లోని 245 గ్రామాలు రెండు మున్సిపాలిటీలకు నీటి సరఫరా ఉండదని చెప్పారు.

Similar News

News March 7, 2025

ముత్తన్నపేట: అప్పుల బాధతో వ్యక్తి మృతి.. కేసు నమోదు

image

ముత్తన్నపేట గ్రామానికి చెందిన రవి (45) వ్యవసాయానికి చేసిన అప్పులు, పిల్లల చదువుల ఫీజులు చెల్లించలేక బుధవారం సాయంత్రం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని బెజ్జంకి ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపారు. పురుగుల మందు సేవించిన ఆయనను కరీంనగర్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా అప్పటికే మృతి చెందినట్లు మృతుడి భార్య రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.

News March 7, 2025

అల్లు అర్జున్, స్నేహా బంధానికి పద్నాలుగేళ్లు

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహారెడ్డి తమ పద్నాలుగో పెళ్లి రోజు జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. ఇవి చూసిన ఫ్యాన్స్ తెగ సంతోష పడిపోతున్నారు. 2011లో స్నేహాను బన్నీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి అయాన్, అర్హ ఇద్దరు పిల్లలు ఉన్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ తెరకెక్కించబోయే సినిమా కోసం సిద్ధంగా ఉన్నట్లు టాక్.

News March 7, 2025

మెదక్: నీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు: కలెక్టర్

image

ఈ వేసవిలో నీటి సరఫరాలో అంతరాయం లేకుండా, క్షేత్ర స్థాయిలో సమస్యలు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం మెదక్ కలెక్టరేట్ సమావేశ హాలులో సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై అదనపు కలెక్టర్ నగేష్‌తో కలిసి సమీక్షించారు. తాగునీటి పంపిణీలో సమస్యలు ఏర్పడితే ప్రత్యామ్నాయ చర్యలు ద్వారా నీటిని సరఫరా చేసేందుకు నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించాలని అన్నారు.

error: Content is protected !!