News March 6, 2025
ఏలూరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి

దెందులూరు నియోజకవర్గం చోదిమెళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం దుర్ఘటనపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంతత్రి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం చోదిమెళ్ల బ్రిడ్జి వద్ద లారీని ఢీకొన్న దుర్ఘటన అత్యంత విషాదకరమన్నారు.
Similar News
News July 9, 2025
HYD: BC బోనం పోస్టర్ ఆవిష్కరించిన చిరంజీవులు

42% బీసీ రిజర్వేషన్‌ను నోటిఫికేషన్‌తో వెంటనే అమలు చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నం, సుప్రీంకోర్టు 50% పరిమితి నిబంధనకు విరుద్ధమని BC ఇంటలెక్చువల్స్ ఫోరం ఛైర్మన్ (Retd IAS) చిరంజీవులు అన్నారు. OUలో BC బోనం పోస్టర్ ఆవిష్కరణలో భాగంగా కులగణన తర్వాత రిజర్వేషన్‌ను 68% పెంచితే పాట్నా హై కోర్టు కొట్టేసిన అనుభవం మన ముందుందని గుర్తు చేశారు.
News July 9, 2025
రామగుండంలో సింగరేణి త్రైపాక్షిక రక్షణ సమావేశం

రామగుండం బంగ్లాస్ ఏరియా గెస్ట్ హౌస్‌లో సింగరేణి 19వ ఏరియా లెవెల్ త్రైపాక్షిక రక్షణ సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. RG-1 GM లలిత్ కుమార్ పాల్గొని అధికారులు, వివిధ యూనియన్ల నాయకులతో చర్చించారు. రక్షణ, సంక్షేమం, సివిల్ ఆసుపత్రి తదితర విషయాలపై చర్చించారు. బొగ్గు గనులు, ఓపెన్ కాస్ట్‌లు ఉత్పత్తి తదితర విషయాలపై ప్రస్తావించారు. అధికారులు ఆంజనేయ ప్రసాద్, చిలుక శ్రీనివాస్, సాయి ప్రసాద్, కర్ణ పాల్గొన్నారు.
News July 9, 2025
ములుగు: గోదావరి పరివాహక ప్రాంతంలో చేపల వేట నిషేధం

జిల్లాలో భారీ వర్షపాతం నమోదైందని, గోదావరి పరివాహక ప్రాంతంలోని మత్స్యకారులు గోదావరిలో చేపల వేటకు వెళ్లొద్దని జిల్లా మత్స్యశాఖ అధికారి సాల్మన్ రాజ్ తెలిపారు. చేపలు గుడ్లు పెట్టి పిల్లలు చేసే జులై, ఆగస్టు మాసంలో చేపల వేట నిషిద్ధమని తెలిపారు. చెరువులు మత్తడి పోస్తున్నప్పుడు మత్తడి ప్రాంతంలో సిమెంటు దిమ్మెలు, ఇనుప జాలీలు, కర్రలు, వలలు పెట్టడం వల్ల చెరువు కట్టలు తెగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు