News March 6, 2025
విశాఖ, విజయవాడ మెట్రోలపై చర్చించా: సీఎం

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన ప్రాజెక్టులపై చర్చించానని సీఎం ట్వీట్ చేశారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై సమాలోచనలు చేశామన్నారు. ఇవి రాష్ట్ర ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని, ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని వివరించారు.
Similar News
News March 7, 2025
పంజాబ్ కింగ్స్ న్యూ జెర్సీ చూశారా?

ఐపీఎల్ 2025 సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. మెటాలిక్ ఎంబ్లమ్, గోల్డ్ కాలర్, గోల్డ్ ఫాయిల్ స్ట్రిప్స్, అథెంటిక్ లేబుల్‌తో జెర్సీ సరికొత్తగా ఉంది. రెడ్ టీషర్ట్, బ్లాక్ ప్యాంట్, బ్లాక్ హెల్మెట్‌తో కిట్‌ను విభిన్నంగా రూపొందించారు. కాగా తమ జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను ఆ ఫ్రాంచైజీ నియమించిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో ఆయన జట్టును ముందుండి నడిపించనున్నారు.
News March 7, 2025
మార్చి 7: చరిత్రలో ఈరోజు

1921: తెలుగు సినిమా తొలి నేపథ్య గాయకుడు ఎమ్.ఎస్. రామారావు జననం
1938: నోబెల్ గ్రహీత, అమెరికా జీవశాస్త్రవేత్త డేవిడ్ బాల్టిమోర్ జననం
1952: వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ జననం
1955: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ జననం
1952: ఆధ్యాత్మిక గురువు పరమహంస యోగానంద మరణం
1979: గ్రంథాలయోద్యమకారుడు అయ్యంకి వెంకటరమణయ్య మరణం
News March 7, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.