News March 6, 2025

ఏసీబీ వలలో ధర్మపురి మున్సిపల్ కమిషనర్

image

ఏసీబీ వలలో ధర్మపురి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ చిక్కుకున్నారు. ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రూ.20 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ధర్మపురిలో ఎప్పటి నుంచో ఈ అవినీతి జరుగుతుందనే ఆరోపణలు కోకొల్లలుగా ఉన్నాయి.

Similar News

News March 7, 2025

NZB: PCPNDT టాస్క్ ఫోర్స్ బృందo తనిఖీలు

image

NZBలో PCPNDT టాస్క్ ఫోర్స్ బృందం సభ్యులు తనిఖీలు చేశారు. ఈ మేరకు గురువారం మెడికవర్, మనోరమ ఆసుపత్రులను ఆరుగురు సభ్యులతో కూడిన బృందం తనిఖీ చేసినట్లు DMHO డాక్టర్ రాజశ్రీ తెలిపారు. జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ DMHO వద్ద నమోదు చేయించుకున్న స్కానింగ్ మిషన్లను రిజిస్టర్ అయిన డాక్టర్స్ మాత్రమే స్కానింగ్ చేయాలని ఆమె సూచించారు. ఒకవేళ ఏదైనా మార్పులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.

News March 7, 2025

దేశానికి యువత ఎక్స్‌ఫ్యాక్టర్: PM మోదీ

image

భారత్ నేడు ప్రపంచ వృద్ధిని నడిపిస్తోందని, యువత దేశానికి ఎక్స్‌ఫ్యాక్టర్ అని PM మోదీ అన్నారు. దేశ భద్రతపై NDA ఎంతో శ్రద్ధ చూపుతోందని ఢిల్లీలో జరిగిన ఓ ప్రోగ్రాంలో వివరించారు. గ్రామాల్లో నక్సలిజం తుడిచిపెట్టుకుపోతే, పట్టణ ప్రాంతాల్లో వ్యాపిస్తోందన్నారు. కొన్ని రాజకీయ పార్టీల మాటల్లో నక్సలిజం భావజాలం కన్పిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో స్లీపర్ సెల్స్, ఉగ్రదాడులు అదృశ్యమైనట్లు చెప్పారు.

News March 7, 2025

సిర్పూర్ (టి): వంతెన పైనుంచి నదిలో పడి వ్యక్తి మృతి

image

మహారాష్ట్రలోని పొడ్స గ్రామం మధ్యలోని నది వంతెన పైనుంచి పడి వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఎస్ఐ కమలాకర్ వివరాల ప్రకారం.. కాగజ్ నగర్ మండలం ఇస్గాంకు చెందిన ప్రశాంత్ (39) వ్యాపార నిమిత్తం మహారాష్ట్రలోని ధాబా గ్రామానికి వెళ్లాడు. తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు నదిలో పడి చనిపోయినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

error: Content is protected !!