News March 6, 2025
భర్త చేతిలో గాయపడిన భార్య మృతి

కొలిమిగుండ్ల మండలం బెలుం సింగవరం గ్రామంలో భర్త చిన్న వెంకటరామిరెడ్డి దాడిలో తీవ్రంగా గాయపడిన భార్య విద్య మనోహరమ్మ బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. భార్యపై అనుమానం పెంచుకొని, తాగిన మైకంలో వెంకట్రామిరెడ్డి రోకలి బండతో భార్యపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో ఉన్న మనోహరమ్మను బనగానపల్లెకు తరలించగా మృతి చెందినట్లు సీఐ రమేశ్ బాబు తెలిపారు.
Similar News
News November 10, 2025
ప్రేమకు చిహ్నం: కుమారుడికి గుడి కట్టించి.. పూజలు

భద్రాద్రి కొత్తగూడెం(D) పాల్వంచ(M) కొత్త సూరారం గ్రామంలో కన్న కొడుకు అకాల మరణాన్ని తట్టుకోలేని తల్లిదండ్రులు, అతని జ్ఞాపకార్థం గుడి కట్టించారు. గ్రామానికి చెందిన జక్కుల శేఖర్-నాగలక్ష్మి దంపతుల కుమారుడు సంపత్ కుమార్ గత ఏడాది కిన్నెరసాని వాగులో ప్రమాదవశాత్తు మరణించాడు. కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు సంపత్ కుమార్ విగ్రహాన్ని తయారు చేయించి, నిత్యం పూజలు చేస్తూ తమ ప్రేమను చూపుతున్నారు.
News November 10, 2025
సఫారీలపై మన రికార్డు పేలవమే..

ఈ నెల 14 నుంచి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో గత రికార్డులు టీమ్ ఇండియాను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటివరకు 16 సిరీస్‌లు జరగగా 8 సార్లు సఫారీలదే విజయం. ఇండియా 4 సార్లు గెలవగా, మరో నాలుగు సిరీస్‌లు డ్రాగా ముగిశాయి. చివరిగా ఆడిన సిరీస్ డ్రాగా ముగియడం భారత్‌కు ఊరటనిస్తోంది. కాగా WTC డిఫెండింగ్ ఛాంపియన్‌ను గిల్ సేన ఓడించాలంటే అన్ని విభాగాల్లోనూ రాణించాల్సిన అవసరం ఉంది.
News November 10, 2025
బహు భార్యత్వ నిషేధిత బిల్లుకు అస్సాం క్యాబినెట్ ఆమోదం

బహు భార్యత్వ(పాలిగామీ) నిషేధిత బిల్లుకు అస్సాం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 25న అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెడుతామని CM హిమంత బిస్వ శర్మ తెలిపారు. దీనిని ఉల్లంఘించి రెండు లేదా అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటే ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తామన్నారు. ఎస్టీలకు తప్పా అందరికీ ఇది వర్తిస్తుందన్నారు. రాష్ట్రంలో 6వ షెడ్యూల్ వర్తించే ప్రాంతాలకు ప్రస్తుతం ఈ బిల్లు నుంచి మినహాయింపు ఉంటుందని చెప్పారు.


