News March 6, 2025

జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యంశాలు!

image

@ జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు @ EVM గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్ @ జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకుల సంబురాలు @ కోరుట్ల మున్సిపల్ కమిషనర్ గా వోదెల రామకృష్ణ @ మెట్పల్లిలో బీట్ చట్టం రద్దు చేయాలని నిరసన @ షుగర్ ఫ్యాక్టరీపై కోరుట్లలో బీజేపీ నేతల ధర్నా @ సారంగాపూర్ లో ఎండిన పొలం.. కన్నీరు పెట్టుకున్న రైతు @ కలెక్టరేట్ ముందు ఆశా కార్యకర్తల నిరసన.

Similar News

News March 22, 2026

బందరులో YCP ఫ్లెక్సీ చించివేత..!

image

బందరులోని 33వ డివిజన్ చింత చెట్టు సెంటర్‌లో ఏర్పాటు చేసిన YCP ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించి వేశారు. రంజాన్ పర్వదినం సందర్భంగా వైసీపీ మాజీ కార్పొరేటర్ అజ్గర్ డివిజన్ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దానిని గుర్తుతెలియని వ్యక్తులు చించి వేయడం పలు రాజకీయ విమర్శలకు దారి తీసింది. ఈ ఘటనపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News March 22, 2026

రైతుల కోసం టెలీ-మానస్ హెల్ప్ లైన్ : ADB కలెక్టర్

image

మానసిక ఒత్తిడితో బాధపడుతున్న రైతులు, వారి కుటుంబసభ్యులు ప్రభుత్వం అందిస్తున్న టెలీ-మానస్ (Tele-MANAS) హెల్ప్‌లైన్ 14416 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఈ నంబర్‌కు కాల్ చేసి నిపుణులైన కౌన్సిలర్ల ద్వారా ఉచిత సలహాలు పొందవచ్చని తెలిపారు. గ్రామ స్థాయిలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఈ సేవలపై అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు. రైతులు మానసిక ఒత్తిడికి గురికావద్దన్నారు.

News March 22, 2026

మార్చి 22: చరిత్రలో ఈరోజు

image

1868: అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ మిల్లికాన్ జననం
2000: ఇన్సాట్-3బీ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది
2005: తమిళ నటుడు జెమినీ గణేశన్ మరణం
2009: సినీ నటుడు, నిర్మాత కాంతారావు మరణం (ఫొటోలో)
* ప్రపంచ జల దినోత్సవం