News March 6, 2025
పెద్దపల్లి: ప్రశాంతంగా రెండో రోజు పరీక్షలు

పెద్దపల్లి జిల్లాలో ఇంటర్ రెండవ సంవత్సరం మొదటి పరీక్ష గురువారం ప్రశాంతంగా జరిగిందని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన తెలిపారు. తెలుగు, హిందీ, ఉర్దూ భాష పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షకు (4900) మంది హాజరు కావాల్సి ఉండగా, (4796)మంది హాజరు కాగా,(104) మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారన్నారు. 97.87% హాజరు నమోదు కావడం జరిగిందన్నారు.
Similar News
News July 4, 2025
ములుగు రోడ్డు జంక్షన్‌లో రోడ్డు ప్రమాదం

వరంగల్ ములుగు రోడ్ జంక్షన్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ డ్రైవర్ బస్సు టైరును వృద్ధుడి కాలుపై నుంచి పోనించడంతో పాదం నుజ్జునుజ్జు అయింది. ప్రమాదంలో గాయపడిన వృద్ధుడిని ల్యాదెళ్లకు చెందిన కొమురయ్యగా గుర్తించారు. వెంటనే అతడిని ట్రాఫిక్ పోలీసులు 108 అంబులెన్స్‌లో ఎంజీఎంకు తరలించారు. ఆర్టీసీ బస్సును మట్టెవాడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News July 4, 2025
కడప: ‘బాలల పరిరక్షణకు కృషి చేయాలి’

బాలల హక్కులను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బి.పద్మావతి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సభ్యురాలు బి.పద్మావతి అధ్యక్షతన బాలల హక్కుల పరిరక్షణ గురించి వివరించారు. వారి కోసం ఉద్దేశించిన చట్టాల అమలు తీరుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
News July 4, 2025
సిరిసిల్ల: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

రాజన్న సిరిసిల్ల జిల్లా నిరుద్యోగ యువతకు అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ (TGMBCDC) HYD ఆధ్వర్యంలో వివిధ నైపుణ్యాలను పెంపొందించేందుకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు tgomms.cgg.gov.in వెబ్‌సైట్‌ను చూడవచ్చన్నారు.