News March 6, 2025
రాజన్న ఆలయంలో దర్గాను తొలగించాలని హుండీలో చీటీలు

తెలంగాణలోని ప్రముఖ వేములవాడ రాజరాజేశ్వర ఆలయ ప్రాంగణంలోని దర్గాను తొలగించాలని కొద్ది రోజులుగా పలు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు భక్తులు ‘దర్గా హఠావో.. వేములవాడ బచావో’ అని చీటీలు రాసి హుండీలో వేశారు. ఆలయ సిబ్బంది వీటిని గమనించి తొలగించారు. కాగా, ఈ దర్గాను రెండు ముస్లిం వర్గాలు నిర్వహిస్తున్నాయి.
Similar News
News March 7, 2025
గాజా నుంచి పారిపోండి: హమాస్‌కు ట్రంప్ అల్టిమేటం

బందీలను విడిచిపెట్టి గాజా నుంచి పారిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్‌ను హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా హమాస్‌పై ట్రంప్ ధ్వజమెత్తారు. ‘మరణించినవారి మృతదేహాలను తక్షణమే అప్పగించండి. బందీలను విడుదల చేయండి. లేదంటే నరకం అనుభవిస్తారు. మిమ్మల్ని చంపడానికి ఇజ్రాయెల్‌కు అవసరమైనవన్నీ ఇస్తా. ఒక్క హమాస్ సభ్యుడు కూడా ప్రాణాలతో ఉండడు. తెలివైన నిర్ణయం తీసుకోండి’ అని ఫైర్ అయ్యారు.
News March 7, 2025
జియో హాట్‌స్టార్ విలీనం ఎఫెక్ట్..1,100 మందిపై వేటు

జియో హాట్‌స్టార్ సంస్థ 1,100 మంది ఉద్యోగులపై వేటు వేసింది. జూన్‌లోగా వీరందరినీ ఉద్యోగంలో నుంచి తొలగించనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. డిస్ట్రిబ్యూషన్, ఫైనాన్స్, కమర్షియల్, లీగల్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఉద్యోగులను ఎక్కువగా తొలగించింది. వీరందరికి 6 నుంచి 12 నెలల జీతం ఇచ్చి వదిలించుకోనుంది. కాగా విలీనం తర్వాత జియో హాట్‌స్టార్ విలువ రూ.70,352 కోట్లుగా ఉంటుందని అంచనా.
News March 7, 2025
ఇంగ్లండ్ కెప్టెన్‌గా బెన్ స్టోక్స్?

ఇంగ్లండ్ వన్డే జట్టు కెప్టెన్‌గా సీనియర్ ప్లేయర్ బెన్ స్టోక్స్‌ను నియమిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే టీ20 జట్టుకు హారీ బ్రూక్‌ను సారథిగా నియమిస్తారని వార్తలు వస్తున్నాయి. కాగా బెన్ స్టోక్స్ ఇప్పటికే వన్డేలకు రెండుసార్లు రిటైర్మెంట్ పలికారు. దీనిపై మరోసారి ఆయనతో ఈసీబీ చర్చలు జరుపుతుందని సమాచారం. కాగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఘోర ప్రదర్శన అనంతరం కెప్టెన్ పదవికి బట్లర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.