News March 7, 2025
విశాఖలో టుడే టాప్ న్యూస్

➤ విశాఖలో ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ చేసిన నేతలు ➤ ఏప్రిల్ 10వ తేదీన సింహాద్రి అప్పన్న చందనోత్సవం ➤ హనుమంతువాకలో యాక్సిడెంట్ ఒకరు మృతి ➤ మల్కాపురం పరిధిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం ➤ ఏయూ వీసీతో నన్నయ్య యునివర్సిటీ వీసీ భేటీ ➤ విశాఖలో ఈ నెల 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ ➤ ఏయూను సందర్శించిన ఎన్.హెచ్.ఆర్.సి సభ్యురాలు
Similar News
News March 19, 2026
మంత్రి పదవి నాకు కొత్త కాదు: గంటా

మంత్రి పదవి తనకు కొత్త కాదని, గతంలోనూ ఆ బాధ్యతలు నిర్వహించానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం సంపత్ వినాయక ఆలయాన్ని దర్శించుకున్న ఆయన.. మంత్రివర్గ విస్తరణ వార్తలపై స్పందించారు. ఎవరిని మంత్రిగా తీసుకోవాలో సీఎం చంద్రబాబుకు పూర్తి స్పష్టత ఉంటుందని, సరైన సమయంలో ఆయన సరైన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ప్రస్తుతానికి ఈ వార్తలన్నీ ఊహాగానాలేనని గంటా స్పష్టం చేశారు.
News March 19, 2026
VMRDA చిల్డ్రన్ ఏరీనాలో అట్టహాసంగా ఉగాది వేడుకలు

VMRDA చిల్డ్రన్ ఏరీనాలో గురువారం శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు అట్టహాసంగా జరిగాయి. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్, జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, VMRDA కమిషనర్ తేజ్ భరత్ పాల్గొన్నారు. ఈ ఏడాది అంతా మంచి జరగాలని ఎమ్మెల్యే గంట ఆకాంక్షించారు. అక్కడ ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
News March 19, 2026
విశాఖ: ‘జోన్ ప్రారంభ తేదీపై స్పష్టత లేదు’

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభంపై స్పష్టమైన తేదీని ఇంకా నిర్ణయించలేదని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లోక్ సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. జోన్ ఏర్పాటుకు సంబంధించిన నిధుల కేటాయింపు, భూసేకరణ, మౌలిక సదుపాయాల పనులు కొనసాగుతున్నాయని, అయితే కార్యకలాపాల ప్రారంభానికి ఇంకా కాలపరిమితి ఖరారు కాలేదని స్పష్టం చేశారు.


