News March 7, 2025
ఏలూరు జిల్లా టుడే టాప్ న్యూస్

➤ చోదిమెళ్ల జాతీయ రహదారిపై ప్రమాదం.. నలుగురి మృతి
➤ జీలుగుమిల్లి మండలంలో తోట దగ్ధం.
➤ పవన్ పెను మార్పులు తెచ్చారు: రెడ్డి అప్పలనాయుడు
➤ గండిగూడెంలో ట్రాన్స్‌ఫార్మర్‌పైనే నవ వరుడి మృతి
➤ ఏలూరు జిల్లాలో తాగు, సాగునీటి సమస్య లేకుండా చర్యలు: కలెక్టర్
➤ కల్లుగీత కార్మికుల మద్యం దుకాణాల లాటరీ తీసిన కలెక్టర్
➤ చాట్రాయి: చేపల వేటకు వెళ్లి అన్నదమ్ముల మృతి
Similar News
News November 9, 2025
కామారెడ్డి జిల్లాలో పెరిగిన చలి తీవ్రత

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం, రాత్రి పూట విపరీతమైన చలి ఉండటంతో ప్రజలు బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. వాహనదారులు పొగ మంచు వల్ల వాహనాలను నడపలేక పోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటి నుంచే చలి మంటలు కాచుకుంటున్నారు.
News November 9, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. కార్తీక మాసంలోనూ మాంసం అమ్మకాలు జోరుగా సాగుతుండటంతో రేట్లు తగ్గలేదు. ఇవాళ హైదరాబాద్‌లో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.220-260, సూర్యాపేటలో రూ.230, కామారెడ్డిలో రూ.250, నిజామాబాద్‌లో రూ.200-220, విజయవాడలో రూ.260, గుంటూరులో రూ.220, మచిలీపట్నంలో రూ.220గా ఉన్నాయి. ఇక మటన్ ధరలు రూ.750-రూ.1,100 మధ్య ఉన్నాయి. మీ ఏరియాలో రేటు ఎంతో కామెంట్ చేయండి.
News November 9, 2025
12న అన్నమయ్య జిల్లాకు CM రాక

అన్నమయ్య జిల్లాకు ఈనెల 12న సీఎం చంద్రబాబు వస్తారని సమాచారం. పేదల గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొనాడానికి గత నెల 29వ తేదీనే చిన్నమండెంకు సీఎం రావాల్సి ఉంది. భారీ వర్షాలతో అప్పుడు పర్యటన రద్దు చేశారు. తాజాగా 12వ తేదీన వస్తారని జిల్లా అధికారులకు సమాచారం అందింది. అధికారికంగా షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. కడప-బెంగళూరు హైవే పక్కన దేవపట్ల క్రాస్ వద్ద హెలిప్యాడ్ సిద్ధం చేస్తున్నారు.


