News March 7, 2025

భానుడి భగభగలు.. మండలాల్లో తీవ్ర వడగాల్పులు

image

అనకాపల్లి జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం తీవ్ర వడగాల్పులు వీచే అవకాశముంది. ఆ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. గురువారం నాతవరంలో 39.9°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు.

Similar News

News March 21, 2026

అనకాపల్లి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

పరవాడ మండలం బొట్టవానిపాలెం వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందినట్లు సీఐ మల్లికార్జునరావు తెలిపారు. బొట్టవానిపాలెం గ్రామానికి చెందిన బొట్టా రమణమ్మ (56) పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్తూ రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొన్నట్లు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

News March 21, 2026

KNR: అమలుకు నోచుకోని రాజీవ్ యువ వికాసం..!

image

కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు నోచుకోక నిరుద్యోగుల్లో నిరాశ పెరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 1,44,640 మంది యువత దరఖాస్తు చేసుకోగా, KNRలో 42,565, పెద్దపల్లిలో 47,470, జగిత్యాలలో 31,128, రాజన్న సిరిసిల్లలో నమోదు చేసుకున్నారు. స్వయం ఉపాధికి రూ.3 లక్షల వరకు సాయం ప్రకటించినప్పటికీ, సంవత్సరం గడిచినా పురోగతి కనిపించక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

News March 21, 2026

తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుకున్న CM చంద్రబాబు

image

తిరుమల శ్రీవారి దర్శనం కోసం కుటుంబ సమేతంగా CM చంద్రబాబు శనివారం ఉదయం ఆలయానికి చేరుకున్నారు. వైకుంఠ 1 నుంచి క్యూ లైన్‌లో స్వామి వారి మహాద్వారం వద్దకు రాగా అర్చకులు వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుని ఆలయంలోకి వెళ్లారు.