News March 7, 2025
SLBC టన్నెల్ పనులను పరిశీలించిన కల్నల్

SLBC టన్నెల్‌లో జరుగుతున్న సహాయక చర్యలను మినిస్ట్రీ ఫర్ హోమ్ అఫైర్స్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ పర్యవేక్షించారు. దిల్లీ నుంచి వచ్చిన ఆయనకు రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్ కుమార్ టన్నెల్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, కొనసాగుతున్న సహాయక చర్యలను వివరించారు.
Similar News
News February 28, 2026
ఉండవెల్లి: డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు..!

అరైవ్, అలైవ్ కార్యక్రమంలో శనివారం ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తా ప్రభుత్వాసుపత్రిలో డ్రైవర్లకు కంటి పరీక్షలు, పుల్లూరు టోల్ ప్లాజా వద్ద ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ మొగిలయ్య, అలంపూర్ సీఐ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రోడ్డు భద్రత నియమాలపై డ్రైవర్లకు అవగాహన కల్పించారు. 100మంది డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు.
News February 28, 2026
ధర్మపురి బ్రహ్మోత్సవాలకు పూర్తి సహకారం: కలెక్టర్

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు జిల్లా పరిపాలన యంత్రాంగం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని తెలిపారు. జిల్లాలో ధర్మపురి క్షేత్రం ఆధ్యాత్మికంగా విశిష్ట స్థానం కలిగి ఉందన్నారు. బ్రహ్మోత్సవాలు శాంతి, సౌభ్రాతృత్వ వాతావరణంలో విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. భక్తులు సంయమనం పాటిస్తూ స్వామివారిని దర్శించుకుని అనంతరం అన్నప్రసాదం స్వీకరించాలని, వాలంటీర్లు,ఆలయ సిబ్బందికి సహకరించాలని కోరారు.
News February 28, 2026
గృహనిర్మాణ శాఖ అధికారులతో సత్యసాయి కలెక్టర్ సమీక్ష

సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఉగాది నాటికి పెండింగ్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలన్నారు. నిర్మాణ పనులు చేపట్టడంలో సిబ్బంది అలసత్వం ప్రదర్శిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


