News March 7, 2025

బాపట్ల: మహిళా దినోత్సవానికి రానున్న మంత్రులు

image

ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు రేపల్లె ఆర్డీవో రామలక్ష్మి తెలిపారు. మహిళా దినోత్సవం నిర్వహించే రేపల్లె ఎంసీఏ పంక్షన్ హాల్‌లో ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్, మంత్రి అనగాని సత్య ప్రసాద్ సోదరుడు శివప్రసాద్‌తో కలిసి పరిశీలించారు. మంత్రులు సత్య ప్రసాద్, పార్థసారథి, కలెక్టర్ పాల్గొంటారన్నారు.

Similar News

News January 9, 2026

భూభారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి: కలెక్టర్

image

బీబీనగర్ తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ హనుమంత రావు, భూభారతి కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలు, సాదాబైనామా పెండింగ్‌ దరఖాస్తులను నిబంధనల ప్రకారం వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూడాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు.

News January 9, 2026

అయోధ్యలో నాన్-వెజ్ ‌నిషేధం

image

అయోధ్య, పంచకోషీ యాత్ర రూట్లలో నాన్-వెజ్ అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్టు UP ప్రభుత్వం ప్రకటించింది. ఆధ్యాత్మిక ప్రాంతాల పవిత్రతను కాపాడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. హోటల్స్, రెస్టారెంట్లలో నాన్-వెజ్ పదార్థాల తయారీ, అమ్మకాలపై నిషేధం అమలులో ఉన్నప్పటికీ కొంతమంది టూరిస్టులు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుని తింటున్నారని ఆరోపణలున్నాయి. దీంతో ఆన్‌లైన్ డెలివరీలపైనా నిషేధం విధించింది.

News January 9, 2026

నిమ్మకాయల నివాసంలో మంత్రి నారాయణ కీలక భేటీ

image

జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి నారాయణ శుక్రవారం మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప నివాసంలో కీలక నేతలతో సమావేశమయ్యారు. టీడీపీ బలోపేతం, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించిన ఆయన, ఆది నుంచి పార్టీ కోసం శ్రమించిన వారికే పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ భేటీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని స్థానిక రాజకీయ పరిణామాలను మంత్రికి వివరించారు.