News March 7, 2025

విశాఖ: 8న జాతీయ లోక్ అదాలత్

image

విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మార్చి 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తామని ఆ సంస్థ కార్యదర్శి వెంకటశేషమ్మ తెలిపారు. జిల్లాలోని అన్ని కోర్టుల్లో లోక్ అదాలత్ జరుగుతుందన్నారు. పెండింగ్‌లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసులు, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్టపరిహారాల కేసులు, ప్రీ-లిటిగేషన్ కేసులను పరిష్కరించుకోవచ్చని సూచించారు.

Similar News

News March 7, 2025

విశాఖపట్నం జిల్లాలో ఫ్రీ బస్.. మీ కామెంట్

image

RTC ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. విశాఖ ప్రజలు ఎక్కువగా అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు రాకపోకలు సాగిస్తుంటారు. అనకాపల్లిలో వివిధ కాలేజీలు ఉండటంతో విద్యార్థినీలు నిత్యం వెళ్తుంటారు. మంత్రి ప్రకటన మేరకు వీరంతా అనకాపల్లి వెళ్లాలంటే టికెట్ కొనాల్సిందే. ఇలా జిల్లా బార్డర్‌లో ఉండే వారికి ఉచిత ప్రయాణం వర్తించదు. దీనిపై మీ కామెంట్.

News March 7, 2025

గాజువాక: రోడ్డు ప్రమాదంలో సచివాలయం ఉద్యోగి మృతి

image

సచివాలయ ఉద్యోగి డాక్ యార్డ్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. కూర్మన్నపాలెం సచివాలయం-1 మహిళా పోలీస్‌గా పనిచేస్తున్న మీను స్కూటీపై తన కుమార్తెతో నగరానికి వెళ్లి తిరిగి వస్తుండగా మారుతి సర్కిల్ సమీపంలో లారీని తప్పించే క్రమంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కుమార్తె గాయపడగా ఆసుపత్రికి తరలించారు. ఎయిర్పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 7, 2025

మల్కాపురం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

మల్కాపురం ప్రకాశ్‌నగర్‌కు చెందిన ఆర్యన్ కుమార్ గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. హెచ్పీసీఎల్‌లో సూపర్వైజర్‌గా పని చేస్తున్న ఆర్యన్ కుమార్ ఇంటికి వెళ్తున్న సమయంలో అతివేగంగా స్కూటీపై వెళుతూ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మల్కాపురం ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!